vrm media ప్రతినిధి ఖమ్మం


— దేవకి వాసుదేవ రావు, బిజెపి, తెలంగాణ రాష్ట్ర కోశాధికారి
జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన కోసం ఇకపై రాజీలేని ఉద్యమ మార్గమే శరణ్యమని, ఈ పోరాటంలో భవిష్యత్తులో కూడా బీజేపీ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు స్పష్టం చేశారు. టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్–2843) ఖమ్మం జిల్లా అధ్యక్షులు
టి.సంతోష్ చక్రవర్తి, జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణలతో పాటు జిల్లా నాయకులు వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలసి, ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్ - 2843) జిల్లా నాయకత్వానికి ఆయన అభినందనలు తెలియజేస్తూ, జర్నలిస్టుల సమస్యలను రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా ఇళ్ల స్థలాల అంశంలో కొనసాగుతున్న నిర్లక్ష్యం తీవ్రమైన ఆవేదన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు గత ప్రభుత్వ హయాంలో క్యాబినెట్ ఆమోదంతో జీవో 147 ద్వారా కేటాయించిన 23.02 ఎకరాల (23 ఎకరాల 2 కుంటలు) ప్రభుత్వ భూమిని ఈరోజు వరకు పంపిణీ చేయలేకపోవడం పాలకుల ఘోర వైఫల్యమే కాకుండా, జర్నలిస్టుల పట్ల చూపుతున్న స్పష్టమైన నిర్లక్ష్యానికి నిదర్శనమని దేవకి వాసుదేవ రావు తీవ్రంగా విమర్శించారు. ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు రాష్ట్ర కేబినెట్లో ఉన్నప్పటికీ, వారి ఇలాఖాలోనే నాలుగో స్తంభానికి న్యాయం జరగకపోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కోశాధికారి అర్వపల్లి నాగేష్, టి.బి.జే.ఏ జిల్లా అధ్యక్షుడు వందనపు సామ్రాట్ గుప్తా, జిల్లా నాయకులు ఎలుగోటి వెంకట్, కప్పల మధు, కందరబోయిన నాగకృష్ణ, షేక్ సోందుమియా, మామిడాల కిరణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ భేటీ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని నింపిందని, భవిష్యత్తులో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం సమిష్టిగా ఉద్యమాత్మకంగా ముంtదుకు సాగుతామని టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్–2843) జిల్లా అధ్యక్షులు టి.సంతోష్ చక్రవర్తి స్పష్టం చేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird