VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం
రాజానగరం మండలం శాసనసభ్యుల వారి కార్యాలయంలో నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు ఉదయం నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, సంక్షేమ పధకాలు వంటి పలు సమస్యలపై ప్రజల వద్ద నుండి పలు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను సంబంధింత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు.
ఈ సందర్భంగా శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుండి నేటి వరకు నిరంతరం ప్రజా సేవే లక్ష్యంగా ముందుకుసాగుతూ.. నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆ కృషికి ప్రతిఫలమే ఇటీవల వైద్య రంగాలని పెద్ద పీట వేస్తూ నియోజకవర్గంలో నూతనంగా 12 ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం రూ. 5.72 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. రాజానగరం నియోజకవర్గాన్ని "ఆరోగ్య రాజానగరం" గా తీర్చిదిద్దాలని పరితపిస్తున్న ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
వీరి వెంట జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird