[ad_1]

-విశ్వక్ సేన్ ఏం చెప్తున్నాడు
-తిరుమల టోకెన్స్ డీటెయిల్స్ ఇవే
-వీడియో వైరల్
వైకుంఠ ఏకాదశి(వైకుంఠ ఏకాదశి)నాడు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షాలు పొందాలని భక్తులందరు తెల్లవారు జామునుంచే పెద్ద ఆలయాలకి తరలివస్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ఆలయాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్న అత్యంత వైష్ణవ ఆలయాలన్నీ రద్దీతో కిటకిటలాడుతాయి. ఆ ఆలయాలన్నీ ఒక ఎత్తయితే పరమ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కటే ఒక ఎత్తు. ఏడుకొండలలో కొలువై ఉన్న ఆ స్వామిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకోవాలనే ఆశ ప్రతి ఒక్కభక్తుడిలో ఉంటుంది. దీంతో ప్రతి వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల బాట పట్టి దర్శనం కోసం భక్తులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు ఈ విషయంపై ప్రముఖ హీరో విశ్వక్ సేన్(విశ్వక్ సేన్)సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసిన వీడియోలో భక్తులకి కొన్ని సూచనలు చేస్తున్నాడు.
ఇది కూడా చదవండి: ఘనంగా జరిగిన సల్మాన్ ఖాన్ 60వ పుట్టిన రోజు.. పెళ్లి న్యూస్ ఇదే
ఈ వీడియోలో విశ్వక్ సేన్ మాట్లాడుతు డిసెంబర్ 30 , 31 , 1 వ తేదీల్లో తిరుమల(తిరుమల)వెళ్లే భక్తులు టోకెన్సు ఉంటేనే దర్శనానికి వెళ్ళండి. టోకెన్స్ లేకుండా వెళ్లి ఇబ్బందులు పడకండి. సపోర్ట్ టీటీడీ అని చెప్పడం జరిగింది. ఇక టీటీడీ కూడా భక్తులకి విజ్ఞప్తి చేస్తు ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు స్వామి దర్శనానికి అనుమతి ఉంటుంది. ఈ పది రోజులు వైకుంఠ ఏకాదశి లాగా సమాన పవిత్రత కలదు. కాబట్టి ఏ రోజు దర్శనం చేసుకున్నాఒకే రకమైన పుణ్యఫలం అందుబాటులో ఉందని టీటీడీ అధికార ప్రకటన చేసింది.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird