అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 27
ఒంటిమిట్ట టిడిపి నాయకులకు,కార్యకర్తలకు చమర్తి దిశా నిర్దేశం
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు,కార్యకర్త పై ఉందని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేసారు.
శనివారం నాడు స్థానిక మండల పార్టీ కార్యాలయం మండల స్థాయి కార్యకర్తల సమీక్షా సమావేశాన్ని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు నిర్వహించారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ టిడిపి నాయకులు నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ఉండాలన్నారు.అదేవిధంగా సూపర్ సిక్స్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని,గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్త పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలన్నారు.
అదేవిధంగా ఏ స్థాయిలో ఉన్న నాయకులైన స్థానికంగా ఉన్న గ్రామ మండల కమిటీలతో కలసి పని చేయాలని అన్నారు.గ్రామ నాయకులు మండల నాయకులు వారితో చర్చించి వారిని కలిపేటటువంటి బాధ్యత తీసుకోవాలన్నారు
అనంతరం మాధవరం,నడింపల్లె,కొండ మాచుపల్లె,గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి విడివిడిగా చర్చించి నాయకులకు,కార్యకర్తలకు చమర్తి జగన్ మోహన్ రాజు పలు విషయాలపై దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి. తెలుగుదేశం పార్టీ ఒంటిమిట్ట క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మలగుంట ఈశ్వరయ్య. క్లాస్ 1 ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వి రమణ. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆలూరి వెంకటసుబ్బయ్య. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కట్ట సుబ్బరాయుడు. ఎంపిటిసి సుంకేసుల భాష. చింతరాజు పల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొడ్డే వెంకటరమణ. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కత్తి చంద్ర. నరవుకటి పల్లి మాజీ ఎంపిటిసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నరసింహ పెన్నాపేరూరు సర్పంచ్. బి లక్ష్మీ నరసయ్య. మాజీ సర్పంచ్ హరి. రాజు గుంటపల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మీనిగా వెంకటరమణ. పెన్నాఒంటిమిట్ట గంగమండలం మైనార్టీ అధ్యక్షుడు గఫూర్ ఖాన్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగరాజు.గ్రామ టిడిపి కోఆర్డినేటర్ రవిశంకర్. టిడిపి మండల కార్యదర్శి గోవిందు. కడప రవి. తదితరులు పాల్గొన్నారు.


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird