Home Uncategorized వైసిపి అధికారంలోకి రాగానే ఆ మండలాలను కడపలో కలుపుదాం

వైసిపి అధికారంలోకి రాగానే ఆ మండలాలను కడపలో కలుపుదాం

by VRM Media
0 comments

సిద్ధవటం VRM డిసెంబర్ 27

రానున్న రోజుల్లో వైసిపి అధికారంలోకి రాగానే సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి హామీ ఇచ్చారు. సిద్ధవటంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో భాగంగా సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయడం అన్యాయమన్నారు. భాగంగా కడపకు అతి సమీపంలో సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలు ఉండడంవల్ల గత వైసిపి ప్రభుత్వంలో రాజంపేట డివిజన్లో ఉన్న వాటిని కడప డివిజన్లో కలిపిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మళ్లీ ఈ రెండు మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయడం తగదని, రానున్న రోజుల్లో వైసిపి అధికారంలోకి రాగానే ఆ రెండు మండలాలను కడపలో కలిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మండలాల పట్ల మాజీ ముఖ్యమంత్రి అవగాహన ఉండడం వల్లనే గతంలో కడపలో కలపడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి, శ్రీకాంత్ రెడ్డి, మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు,సయ్యద్ , నూర్ మాజీ సర్పంచ్ కెవి సుబ్బయ్య, ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సభ్యులు, గోపాలస్వామి, సుబ్బారెడ్డి, కన గాల నరసింహారావు, చైతన్య, పాలకొండ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

2,811 Views

You may also like

Leave a Comment