సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 27
తమ భూములు తమకే ఇప్పించాలని మాధవరం-1 గ్రామ పంచాయతీ ఎస్.కే.ఆర్ నగర్ కు చెందిన దళితులు చేపట్టిన నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. తమకు కేటాయించిన భూములపై కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వారు పెత్తనం చేలాయిస్తున్నారని దళితలు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని మాధవరం-1 గ్రామ పంచాయతీ ఎస్.కే.ఆర్ నగర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతులు భూముల హక్కు కోసం రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రైతులు శనివారం మాట్లాడుతూ సోమశిల ముంపు ప్రాజెక్టు క్రింద తాము సర్వం కోల్పోయామన్నారు. రెవిన్యూ సదస్సులో దళిత కుటుంబాలకు భూములు కేటాయించాలని అధికారులు దృష్టికి తీసుకెళ్లామని సర్వేనెంబర్ 937 నందు ఖాళీగా ప్రభుత్వ భూమి ఉండడంతో తాము దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. అయితే తమకు భూములు కేటాయించకుండా రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తాము దరఖాస్తు చేసుకున్న భూముల్లో ఇటీవల కడప తాలూకా అంటూ చదును చేస్తూ అక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తమకు భూములు కేటాయించేంత వరకు నిరాహార దీక్షలు విరమించే ప్రసక్తే లేదని వారు పేర్కొన్నారు.
