డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ – కలెక్టర్
కడప జిల్లా VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ డిసెంబర్ 27
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పథకం కింద డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను డిసెంబర్ 31వ తేదీన ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని పెన్షన్ దారులందరూ డిసెంబర్ 31న తమ ఇళ్ల వద్దనే అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకోవాలని ఆయన సూచించారు. పెన్షన్ కోసం సచివాలయాలకు లేదా ఇతర కార్యాలయాలకు వెళ్లవద్దని, ప్రతి లబ్ధిదారునికీ ఇంటివద్దనే పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు.
పెన్షన్ల పంపిణీ సజావుగా జరిగేలా ఎంపీడీవోలు, సచివాలయ సిబ్బంది, డిఆర్డిఏ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
