ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్చార్జి కదిరి చంద్రపాల్
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 28
ఒంటిమిట్ట: గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తున్నారన్న వార్తలతో ఈ రెండు మండలాల ప్రజలు ఉద్యమాలు, రిలే నిరాహార దీక్షలు చేసి తమ వ్యతిరేకతను చాటడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ రెండు మండలాలను కడప జిల్లాలోని కొనసాగించాలన్న ఆలోచనకు రావడం హర్షణీయమని ఒంటిమిట్ట మండల టిడిపి యువ నాయకులు కదిరి చంద్రపాల్ సీఎం చంద్రబాబు నాయుడుని ప్రశంసించారు. దీక్షలో పాల్గొన్న సోదరులకు దీక్షలో పాల్గొన్న జేఏసీ నాయకులకు పార్టీ నాయకులకు అలాగే ర్యాలీలో పాల్గొన్న నాయకులకు జేఏసీ నాయకులకు పార్టీ నాయకులకు పత్రిక విలేకరులకు డ్వాక్రా మహిళలకు విద్యార్థిని విద్యార్థులకు ప్రజలకు ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ ఈనిటి ఇంచార్జ్ కదిరి చంద్రపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తీర్పును గౌరవిస్తూ ఈ ఆలోచనకు రావడం ఈ రెండు మండలాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడమే అవుతుందన్నారు. ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తే ప్రజలు పడబోయే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి అనుకూలంగా కడప జిల్లాలోనే కొనసాగించాలనుకోవడం శుభపరిణామం అన్నారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird