
VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం
తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం శ్రీచక్రద్వారా బంధం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భవాని సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం వద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణానికి
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు
లక్ష రూపాయలు విరాళాన్ని రాజానగరం బీజేపీ మండల అధ్యక్షులు, ఆళ్ల శివ నాగ రాజు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులకు సోమవారం అందజేశారు..
ఇటీవలే శ్రీ చక్రద్వార బంధం గ్రామంలో ఆలయం వద్ద జరిగిన లక్ష దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కంబాల శ్రీనివాసరావు గారిని కమిటీ సభ్యులు, గ్రామస్తులు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సహాయం చేయాలనీ కోరారు.
తక్షణమే స్పందించిన కంబాల శ్రీనివాసరావు గారు లక్ష రూపాయలు విరాళాన్ని ప్రకటించారు, ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయలు విరాళం చెక్ ను సోమవారం అందజేసారు.