శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాలు సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ గ్రామంలో
విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో గత నెల 26వ తేదీన గ్రామంలో ప్రారంభమైన కబడ్డీ టోర్నమెంట్ పోటీలు మంగళరాత్రి ముగిసాయి.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంబాల శ్రీనివాసరావు గారు హాజరయ్యారు. తొలిత కమిటీ సభ్యులు, గ్రామస్తులు, యువత ఆయనకు ఘన స్వాగతం పలికి, పూలమాలలతో సత్కరించారు. హోరా హోరీగా జరిగిన ఫైనల్ పోటీలను తిలకించారు.
ఫైనల్ పోటిల్లో తాళరేవు మండలం రామన్నపాలెం టీం మొదట స్థానంలో నిలబడగా, ఠాగూర్ పాలెం టీం రెండోవ స్థానం, గాదరాడ టీం మూడోవ స్థానం, పెంటపల్లి టీం నాలుగోవ స్థానంలో విజేతలుగా గెలుపొందాయి.
ఫైనల్లో గెలుపొందిన విజేతలకు కంబాల శ్రీనివాసరావు గారు బహుమతులు ప్రధానం చేశారు. మొదటి విజేతకు 20 వేలు, రెండొవ బహుమతి 15 వేలు, మూడోవ విజేతకు 10, వేలు, నాలుగో విజేతకు 5, వేలు రూపాయలు చొప్పున 50,000 రూపాయలు నగదు పంపిణీ చేసి, ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు.
అలాగే నలుగురు అంపైర్లు ఒకొక్కరికి 2,500 చొప్పున పది వేలు రూపాయలు అందజేశారు. బెస్ట్ రైడర్ కు 3 వేలు, బెస్ట్ డిపెండర్ కు 2, వేలు రూపాయలు నగదు అందజేశారు.
బెస్ట్ ఆల్ రౌండర్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ కు ట్రోపీలు అందజేశారు. అలాగే కబడ్డీ కోర్టులో ముగ్గులు వేసిన ఇద్దరి యువతకు ఒక్కొక్కరికి 1,000 రూపాయలు చొప్పున రెండు వేలు రూపాయలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు..