Home ఎంటర్‌టెయిన్మెంట్ రాజాసాబ్ మూవీ ర‌న్‌టైమ్ ఎంతో తెలుసా?.. ప్ర‌భాస్‌కిది మామూలేనా? – VRM MEDIA

రాజాసాబ్ మూవీ ర‌న్‌టైమ్ ఎంతో తెలుసా?.. ప్ర‌భాస్‌కిది మామూలేనా? – VRM MEDIA

by VRM Media
0 comments
రాజాసాబ్ మూవీ ర‌న్‌టైమ్ ఎంతో తెలుసా?.. ప్ర‌భాస్‌కిది మామూలేనా?



– ప్ర‌భాస్ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్లు
– సంక్రాంతి కానుకగా రాజా సాబ్
– ప్రభాస్ మొదటి హారర్ థ్రిల్లర్

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘ది రాజా సాబ్‌’. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందించబడిన ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటివరకు మారుతి చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా, భారీ బడ్జెట్‌తో డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది.

సలార్, కల్కి వంటి భారీ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్దికుమార్‌.. ఈ ముగ్గురూ ప్రభాస్‌తో రొమాన్స్‌ చేయబోతున్నారు. బాలీవుడ్ స్టార్ సంజరుదత్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఒక ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులను రాజసాబ్‌ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడని అర్థమవుతోంది.

షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈమధ్యకాలంలో ప్రభాస్‌ చేసిన సినిమాలన్నీ ఎక్కువ రన్‌టైమ్‌తోనే ఉన్నాయి. ఇప్పుడు రాజాసాబ్ కూడా ఆ వరసలో నిలవబోతోంది. ఈ సినిమాకి సంబంధించి అమెరికాలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. టికెట్‌ బుకింగ్‌సైట్‌లో ఉంచిన సమాచారం మేరకు ‘రాజా సాబ్‌’ మూవీ రన్‌టైమ్‌ సుమారు 3 గంటల 14 నిమిషాలు. అంటే ప్రభాస్ గతంలో చేసిన సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా రన్ టైం ఉంది. మరి ఇది సినిమా రన్‌పై ప్రభావం చూపిస్తుందా? లేక ట్రిమ్ చేస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

2,835 Views

You may also like

Leave a Comment