Home ఆంధ్రప్రదేశ్ అవగాహన అనుభవంతోనే కష్టపడిన వారికి పదవులను అందించాం

అవగాహన అనుభవంతోనే కష్టపడిన వారికి పదవులను అందించాం

by VRM Media
0 comments

  • దేవీపట్నం టిడిపి మండల అధ్యక్షుడు గోళ్ళ చంటిబాబు, మండల ప్రధాన కార్యదర్శి కీర్తి గంగరాజు

VRM Media ప్రతినిధి భద్రం అయినవల్లి

డిసెంబర్ మూడో తారీఖున బుధవారం నాడు అవగాహన అనుభవం పాలించే రాజకీయ నాయకులతో ఇబ్బందులు పడుతున్న తెలుగు తమ్ముళ్లు అని ఒక పత్రికలో వచ్చిన కథనానికి దేవీపట్నం టిడిపి మండల అధ్యక్షుడు గోళ్ళ చంటిబాబు, స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీలో కొంతమంది కావాలని నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మండల అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటినుండి నాపై తప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ పార్టీలో విభేదాలు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు.పార్టీకి పనిచేయకపోతే న్యాయం జరగదని, పనిచేసిన వారికి రాష్ట్ర హైకమాండే నేరుగా పదవులు కేటాయిస్తుందని సూచించారు. గతంలో మండల పార్టీ ఎన్నికలు తమకు అనుకూలంగా రాలేదని కొందరు చేస్తున్న కుట్ర ఇది ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.ఎవరు కూడా ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని కార్యకర్త లకు ఆయన స్పష్టం చేశారు. నాయకులు కార్యకర్తలు అలక వీడి ఐక్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతీ ఒక్కరూ దాన్ని తు.చ. తప్పకుండా పాటించాలన్నారు. అందరం ఒకే లక్ష్యంతో పనిచేస్తేనే విజయాలు సాధిస్తాం” అని ఆయన అన్నారు. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌ఛార్జ్‌లతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.అహంకారం వద్దని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మనం ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి. ప్రజల హృదయాలను గెలుచుకోవాలి అని హితవు పలికారు.ఎమ్మెల్యే మిరియాల శిరీష భాస్కర్ ఆదేశాల మేరకే తాము పని చేస్తున్నామని సొంత ధోరణిలో నిర్ణయాలు తీసుకోమని ప్రస్తుతం మండలం మొత్తం ఐక్యంగా ఉందని కావాలని కొంతమంది కుట్రపూరిత కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా వారి ధోరణి మార్చుకొని కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు.పార్టీలో ఎవరు విభేదాలు సృష్టించవద్దని అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని దానికి అందరూ సహకరించాలని మండల పరిధిలో మండల అధ్యక్షులు గాని, నియోజవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గారు గాని అందర్నీ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళుతున్నామని, పార్టీ ప్రతిష్టని ఎవరు భంగం కలగజేసిన తప్పక చర్యలు ఉంటాయని ఆయన పార్టీ నాయకులను కార్యకర్తలను కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఎల్లేటి కృష్ణమోహన్,ఇందుకూరుపేట సొసైటీ అధ్యక్షులు మాగాపు బాబురావు, దేవీపట్నం సొసైటీ అధ్యక్షులు కొండ్ల చిన్న కొండ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు ముండ్రు మధుసూదన్ రావు మాజీ మండల అధ్యక్షులు తైలం గంగాధర్ రావు మండల ఎస్టీసెల్ అధ్యక్షులు సోదే వెంకన్న దొర, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జొన్నల రాంబాబు, కో క్లస్టర్ ఇన్చార్జి అడబాల వీరభద్రరావు, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మిత్తివాడ వీరబాబు మండల రైతు అధ్యక్షులు చారపు రామారావుదొర, మండల రైతు ప్రధాన కార్యదర్శి ఈరేటి బ్రహ్మాజీరావు ఐటీడీపీ మండల అధ్యక్షులు అంజిరెడ్డి తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కుటుంబ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు జొన్నల శ్రీనివాస్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి దొరబాబు,ఉపాధ్యక్షులు కోట్ల రామకృష్ణారెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు ముచ్చు త్రిమూర్తులు, ప్రధాన కార్యదర్శి ముత్తం శెట్టి రాంబాబు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పెనుమతి రాజు ప్రధాన కార్యదర్శి కత్తుల రాజు తెలుగు ఉపాధ్యాయులు కామిశెట్టి శ్రీను,నేసిక బాబురావు సొసైటీ డైరెక్టర్లు పల్లపాటి నాగేశ్వరరావు మడకం శ్రీనివాస్ దొర ఏరియా ఇన్చార్జిలు కర్రీ రాజీవ్, మల్లేశ్వరరావు బూతు కన్వీనర్లు పాతాళ వీరపండు మల్లేశ్వరరావు దబ్బా నాని, బంటుమల్లి లక్ష్మణ్ మండల ప్రచార కార్యదర్శి పేరుగాని ఏసు, కొమరం మల్లేశ్వరరావు, మండల రైతు కార్యదర్శి గణిశెట్టి వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.

2,826 Views

You may also like

Leave a Comment