Home ఆంధ్రప్రదేశ్ అభయ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న ముదునూరి మురళీకృష్ణం రాజు

అభయ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న ముదునూరి మురళీకృష్ణం రాజు

by VRM Media
0 comments

అన్నదానానికి ₹15,000 విరాళం

ప్రత్తిపాడు, Vrm media న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ డిసెంబర్ 4:–

ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలోని జువ్వల వారి రామాలయం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్‌సీపీ ప్రముఖ నాయకులు, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు మరియు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు అభయ ఆంజనేయ స్వామివారి దర్శనం చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే ముదునూరి మురళీకృష్ణం రాజు, హనుమాన్ జయంతి సందర్భం పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన అన్నదానానికి ₹15,000 విరాళం అందజేయడం ద్వారా మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నానిపల్లి చంటి, జువ్వల దొరబాబు, మాజీ వైస్ సర్పంచ్ జువ్వల సత్యనారాయణ, బొల్లు నాగేశ్వరరావు, ముచ్చర్ల దాసు, పోకనాటి వెంకటేశ్వరరావు, దొడ్డిపట్ల కృష్ణ, జువ్వల శివ తదితరులు పాల్గొన్నారు.

2,829 Views

You may also like

Leave a Comment