Home ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం కోసం వీఆర్ఏలు వినతి

సమస్యల పరిష్కారం కోసం వీఆర్ఏలు వినతి

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 4

వీఆర్ఏల సమస్యల పరిష్కారం కొరకు వీఆర్ఏల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డిసెంబర్ 5న జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వీఆర్ఏల జిల్లా అధ్యక్షులు వెంకటపతి తెలిపారు మండల కేంద్రమైన సిద్ధపటం లోని తాసిల్దార్ ఆకుల తిరుమల బాబుకు గురువారం తమ ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవిన్యూ శాఖలో సుమారు 19,359 వేలమంది గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నారని రేవుని శాఖలో సుదీర్ఘకాలం నుండి చాలా తక్కువ వేతనంతో పనిచేస్తున్నామని, డిపార్ట్మెంట్లో దిగువ స్థాయిలో పనిచేస్తూ ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉన్నావని ఆయా గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి వీఆర్ఏల ప్రధాన పాత్ర పోషిస్తూ గ్రామంలో నివసిస్తూ అనునిత్యం సమస్యలు పరిష్కారంలో ప్రజలకు అందుబాటులో ఉన్నామని వీఆర్ఏలకు పని భారం ఎక్కువైందని గత ప్రభుత్వంలో వీఆర్ఏలకు వేతనాలు పెంచలేదని రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిసెంబర్ 5న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏల జిల్లా అధ్యక్షులు వెంకటపతి, వీఆర్ఏలు, కిషోర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

2,819 Views

You may also like

Leave a Comment