
దేవీపట్నం డిసెంబర్ ప్రెస్ నోట్:VRM Media ఏ భద్రం
రంపచోడవరం నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గంగా పేరు తప్పా పదవులు శూన్యం అని దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయతీ వివిధ గ్రామాలకు చెందిన గిరిజన కుటుంబాలైన లోతు పాలెం, చాప రాల పల్లి గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఎవరిపైన వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని పార్టీ చేసే తప్పులు కప్పిపుచ్చుకుంటున్నారని, నీతులు చెప్పే నాయకులు ప్రతిపక్షంలో ఉండగా అనంతబాబు కాళ్లు కడగలేదా -? రంపచోడవరం నియోజకవర్గం లో గిరిజన కుటుంబాల ఓటు బ్యాంకు సుమారు 70% పైగానే ఉన్న రాజకీయంగా మాకు ఏ విధమైన గ్రామ, మండల, కార్యకర్తలకు గుర్తింపు ఉందా లేదా చెప్పండి. పాలకులకు బ్రోకర్లుగా పెట్టుకున్న కొంతమందికి మాత్రమే పదవులు కట్టబెట్టారు. ఎస్టీ నియోజకవర్గంలో 30% ఉన్న నాన్ ట్రైబల్ ఒక్కొక్కడు రెండేసి, మూడేసి పదవులు మీ రాజకీయ లబ్ధి కోసం వేసుకోలేదా–? మేము ట్రైబల్ కుటుంబాల్లో పుట్టిన మేము ఎవరిని మోసం చేయలేదు. కొంత మంది మా ట్రైబల్ కుటుంబాలను అడ్డుపెట్టుకుని బినామీ పేర్లతో లబ్ది పొందే వారు మీరు కాదా -? ఒక్క మాట చెప్పాలంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామా లేక స్వపక్షంలో ఉన్నామా అన్నట్టుగా ఉంది ఇంత జరిగినా రాజకీయ పరిశీలకులు గానీ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కూడా రాలేదు. ఇది మా పంచాయతీలో జరుగుతున్న సమస్య కాదు .దేవీపట్నం మండల వ్యవస్థ బాగోలేదు అలాగని నియోజకవర్గ స్థాయిలో పరిశీలకులకు చెప్పిన అంతా శూన్యమే కనబడుతుంది ఈ విషయాలన్నీ కూడా రెండు మూడు రోజుల్లో మంగళగిరి పార్టీ ఆఫీసులో ఫిర్యాదు చేస్తామని అంటున్న కార్యకర్తలుచవలం రామకృష్ణ దొర ఉపసర్పంచ్,అడ్డపల్లి సత్యనారాయణ పిసా చట్టం అధ్యక్షుడు తుర్రం వెంకటరమణ,అడ్డపల్లి రామకృష్ణ నీటి సంఘం అధ్యక్షులు,తుర్రం భీమన్న దొర బూత్ కమిటీ అధ్యక్షులు, వానపల్లి సత్యనారాయణ సీనియర్ నాయకుడు, పరదా రాజన్న దొర,కుంజం,బాపన దొర,తుర్రం నాగేశ్వరరావు, చోదే బాలు దొర తదితర కార్యకర్తలు తెలియజేసినారు.