
దేవీపట్నం,డిసెంబర్ 5.VRM Midea దుర్గా ప్రసాద్
అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం,దేవారం గ్రామపంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల నందు మెగా పేటీఎం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా దేవారం గ్రామపంచాయతీ సర్పంచ్ తుర్రం రమాదేవి,శరభవరం దేవారం ఎంపీటీసీ,వైఎస్ఆర్సిపి యూత్ కన్వీనర్ తుర్రం జగదీష్ దొర మాట్లాడుతూ…నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో అమలు చేస్తున్న గుణాత్మక విద్యను విద్యార్థులందరూ తార్కిక జ్ఞానంతో అందిపుచ్చుకోవాలన్నారు.ఈ ప్రపంచాన్ని మార్చగలిగే ఒకే ఒక్క ఆయుధం చదువు అన్నారు.చదువు ఒక్కటే సామాన్యులను కూడా ఉన్నత స్థానంలో నిలబెడుతుందన్నారు.కావున ప్రతి తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని మీ పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా విద్యార్థుల యొక్క సామర్ధ్యాలను మరియు ప్రోగ్రెస్ రిపోర్టులను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు.ఈరోజు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు సందర్భంగా పోతవరం గ్రామంలోని దేవీపట్నం ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల,దేవారం గ్రామంలోని ఎంపీపీ పాఠశాల మరియు దామనపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల మరియు కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశాలలో పాల్గొనడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ తుర్రం రామకృష్ణ దొర,వార్డు మెంబరు కలుం వెంకన్న దొర,గ్రామ పెద్ద కొమరం పెద్దబ్బులు,తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ కొమరం వెంకటేశ్వర్లు దొర, ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరం రామకృష్ణ దొర,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు మొదలైన వారు పాల్గొన్నారు.