
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందించిన భారీ సినిమా ‘అఖండ 2: తాండవం’ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడిన విషం. కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్న సమయానికి థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని చెప్పారు. అయితే కొత్త రిలీజ్ డేట్ ప్రస్తావన ఆ ప్రకటనలో లేదు. దీంతో ఈ సినిమా రిలీజ్‌పై ఇంకా సస్పెన్స్ కొన సాగుతోంది.
“అఖండ-2 (అఖండ2) చిత్రం థియేటర్లలోకి తీసుకురావడానికి మా శాయశక్తులా ప్రయత్నించాం. ఎంత కృషి చేసినా కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఫలితం రాదు. కొన్నిసార్లు మనం ఊహించని సంఘటనలు జరుగుతాయి. సందర్బంగా అభిమానులకు, ప్రియులందరికీ క్షమాపణలు చెబుతున్నాయి” అని 14 రీల్స్ ప్లస్ సంస్థ తమ ప్రకటనలో కనిపించింది.