

రాజంపేట ను జిల్లా కేంద్రంగా చేయాలి
ఒంటిమిట్ట హరిత హోటల్లో తెలుగుదేశం పార్టీ కీలక సమావేశం
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 7
ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను కడపలోనే ఉంచాలి.
ఒంటిమిట్ట , సిద్దవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో కలిపే పక్షంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా మార్చాలి
బుధవారం భారీ కార్యాచరణ ర్యాలీలు, దేవాలయ పూజలు, మానవహారం
ఆదివారం హరిత హోటల్లో సమీక్షా సమావేశం నిర్వహించిన టిడిపి నాయకులు
కలెక్టర్‌కు ఐదు వాహనాల్లో వినతిపత్రం సమర్పణ
ఒంటిమిట్ట:
సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల భవితవ్యంపై జరుగుతున్న చర్చలు, ప్రతిపాదనలకు గట్టి మలుపు తిప్పేందుకు తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. బుధవారం రోజున ఒంటిమిట్ట కేంద్రంగా జేఏసీ ఆధ్వర్యంలో ఓ భారీ కార్యక్రమాల శ్రేణి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సిద్ధవటం మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలి లేదంటే రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా మార్చాలి” అంటూ ప్రభుత్వం ముందు స్పష్టమైన డిమాండ్లను పెట్టనున్నారు.
బుధవారము ఉదయం ఒంటిమిట్టలో భారీ ర్యాలీ ఊరేగనుంది. ప్రధాన రహదారుల గుండా సాగనున్న ఈ ర్యాలీ అనంతరం రామాలయములో టెంకాయ కొట్టి, హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం తాసిల్దార్, మండల అభివృద్ధి అధికారి (ఎంఆర్‌డీఓ)లకు వినతిపత్రం అందజేయనున్నారు.
మానవహారం వంటావార్పు సామూహిక భోజనం
వినతిపత్రం అనంతరం ఒంటిమిట్ట ప్రధాన సర్కిల్‌లో మానవహారం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, రైతులు, ఉపాధ్యాయులు, యువత భారీగా పాల్గొననున్నారు. అదే స్థలంలో వంటావార్పు కార్యక్రమం ఏర్పాటు చేసి, రెండు గంటల పాటు సామూహిక భోజన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇది ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలవనుంది.
కలెక్టర్‌ను కలిసి కీలక వినతి
ఈ కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం ఒంటిమిట్ట నుంచి ఐదు వాహనాల కాన్వాయ్‌గా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి, అధికారికంగా వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలని, ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరనున్నారు.
హరిత హోటల్లో టిడిపి ముఖ్య సమావేశం
ఇదే సందర్భంలో ఆది వారం సాయంత్రం ఒంటిమిట్ట హరిత హోటల్లో తెలుగుదేశం పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల భవిష్యత్తుపై సమగ్రంగా చర్చించి, బుధవారం జరగబోయే కార్యక్రమాలకు పార్టీ సంపూర్ణ మద్దతుగా నిలవాలని తీర్మానించారు.