Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట సిద్దపట్టం మండలాలకు తల్లి కడప జిల్లా. కడప లోనే రెండు మండలాలను కొనసాగించండి

ఒంటిమిట్ట సిద్దపట్టం మండలాలకు తల్లి కడప జిల్లా. కడప లోనే రెండు మండలాలను కొనసాగించండి

by VRM Media
0 comments

అయితే కడప.. లేదంటే రాజంపేట

ఒంటిమిట్ట లో ర్యాలీలు – ఉద్యమానికి ఊపిరి

ఒంటిమిట్ట–కడప అనుబంధంఒక సంఘీభావ ఉద్యమం

రాయచోటి వద్దు – కడప ముద్దు

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 10

ఒంటిమిట్ట , డిసెంబర్ 10: ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం అయిన డిసెంబర్ 10న ఒంటిమిట్ట మండల ప్రజలు తమ హక్కుల కోసం గళమెత్తారు. అయితే కడప.. లేదంటే రాజంపేట నినదించారు. ఒంటిమిట్ట మండలాన్ని అన్నమయ్య జిల్లాలో చేర్చే గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి నిరసనగా జేఏసీ పిలుపుతో మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాలన్నీ ఒకే దిశగా కదిలాయి. వందలాదిగా గ్రామాల ప్రజలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మరియు స్థానికులు ర్యాలీల్లో పాల్గొన్నారు. గ్రామాలనుండి తండోపతండాలుగా బయలుదేరి ఒంటిమిట్ట కేంద్రంలో కలిసే విధంగా ఏర్పాట్లు చేశారు. ర్యాలీలు శాంతియుతంగా, క్రమశిక్షణతో సాగాయి. ర్యాలీ లో మా ఊరును మా నుంచే దూరం చేస్తారా…?, “మా అడుగులకు ఇంకా కడప ధూళే ఉంది…”
చరిత్ర మర్చిపోకండి… మమ్మల్నీ మర్చిపోకండి,
పటంలో గీతలు… గుండెల్లో గాయాలు, కడపతో నడిచాం… కడపతోనే ఉంటాం, అమ్మను వదల్లేం…కడప ను వదల్లేం, ఒంటిమిట్ట గుండె ఏడుస్తుంది, చేయొద్దు చేయొద్దు – కడపనుదూరం చేయొద్దు,
కలపొద్దు కలపొద్దు- రాయచోటిలో కలపొద్దు,
మా ఊరు – మా కడప, ఒంటిమిట్ట అంటే కడప… కడప అంటే ఒంటిమిట్ట అనే నినాదాలు ఉద్యమానికి ప్రతీకగా నిలిచాయి. ప్రజల ఎటువంటి అంతరాయం లేకుండా క్రమశిక్షణతో , ర్యాలీని విజయవంతం చేశారు.
ప్రజలు స్వయంగా వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. వంటకాలు సిద్ధం చేసి పాల్గొనేవారికి అందించడం ద్వారా పోరాటానికి కొత్త శక్తినిచ్చారు. ఇది కేవలం భోజనం మాత్రమే కాదు; పోరాటానికి ప్రతీకగా, ప్రజల సంకల్పానికి సహకారంగా నిలిచింది. వంటవార్పు ద్వారా ర్యాలీ, మానవహారం, దీక్షలతో ఏర్పడిన ఉద్యమ బలాన్ని మరింత బలపరిచింది.
రిలే నిరాహార దీక్షలు – నిశ్శబ్ద శక్తి
జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరాయి. ఐదవ రోజు పాటూరు గంగిరెడ్డి, రఘురాం రెడ్డి, గురూజీ వర్మ, మల్లేష్ యాదవ్, షేక్ అమానుల్లా, డేరంగుల రామయ్య, గుర్రంకొండ శ్రీనివాసులు, జలగం వెంకటయ్య, నంద్యాల వెంకటేశు, బాణాలహరి , సుబ్బారెడ్డి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రతినిధులు దీక్షలో పాల్గొని తమ సంకల్పాన్ని వ్యక్తం చేశారు. నిరాహార దీక్షల ద్వారా ఉద్యమానికి నూతన జవసత్వాలు ఏర్పడ్డాయి. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాక, ప్రజాస్వామ్యంలో ప్రజల సంకల్పాన్ని కూడా తెలియజేసే ఘట్టంగా నిలిచింది.
జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ అంతరాయం
ర్యాలీ ఒంటిమిట్ట కోదండ రామాలయం నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు జాతీయ రహదారిపై వెళ్ళవలసి రావడంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని ట్రాఫిక్ ను పక్కకు మళ్ళించారు.
వినతిపత్రాల సమర్పణ
ర్యాలీ మరియు దీక్షల అనంతరం జేఏసీ ప్రతినిధులు తహసీల్దార్, ఎంపీడీవో, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ఈ పత్రాలలో ఒంటిమిట్ట–కడప అనుబంధం, భౌగోళిక సౌలభ్యం, పరిపాలనా కారణాలు, ప్రజల అవసరాలను స్పష్టంగా వివరించారు. మద్దతు లేకుండా వచ్చిన నిర్ణయాలు కొనసాగరాని విషయాన్ని ప్రతిపాదించడం ద్వారా, ప్రభుత్వం ముందస్తుగా ప్రజా సంకల్పాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వినతిపత్రాల లో “ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు కడప జిల్లాలోనే కొనసాగాలి. ఒంటిమిట్ట సిద్ధపటం మండలాలను అన్నమయ్య జిల్లాలో కొనసాగించదలిస్తే రాజంపేట ను జిల్లా కేంద్రం చేయాలి.”
తుది సంకల్పం – ఒంటిమిట్ట కడపలోనే కొనసాగాలి
ఇంతవరకు జరిగిన అన్ని ర్యాలీలు, మానవహారాలు, వంటవార్పు, దీక్షలు మరియు వినతిపత్రాల సమర్పణ ఒంటిమిట్ట–కడప అనుబంధం భౌగోళిక, చారిత్రక, పరిపాలనా కారణాలవలన మారలేనిది అని స్పష్టంగా తెలియజేశాయి. ఈ ఉద్యమం ఎటువంటి నోటిఫికేషన్‌తో, జిల్లాల పునర్విభజనతో ప్రభావితం కాకుండా, ఒంటిమిట్ట–కడప బంధాన్ని రక్షించడమే ప్రధాన సంకల్పం అని నిరూపించింది. ఒంటిమిట్ట అంటే కడప… కడప అంటే ఒంటిమిట్ట అన్న నినాదం ఒక్క మాటలో కాదు, ప్రతి కార్యకలాపంలో, ప్రతి నిర్వహణలో, ప్రతి ర్యాలీలో భాగమైంది.
ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి , ఒంటిమిట్టఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి సాలాబాద్ బుజ్జి,
కొత్తపల్లి బొబ్బిలి రాయుడు, ఎస్వీ రమణ , లాయర్ రామదాసు, బొడ్డే వెంకటరమణ, బొడ్డేలక్ష్మీనారాయణ , కుడమలూరు రమణ, మీనిగ వెంకటరమణ, సుంకేసుల భాష , ఈశ్వరయ్య, శ్రీహరి, గజ్జల శ్రీనివాసరెడ్డి , డాక్టర్ జిలాని, డాక్టర్ శివకుమార్, కోనరాజుపల్లిపల్లి భాష, వెంకటరెడ్డి , రాజారెడ్డి , వీరాంజనేయరెడ్డి , తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆలూరు వెంకటసుబ్బయ్య , లక్ష్మీనారాయణ రెడ్డి , ఉన్నది ఒక్కటే పల్లి వెంకటసుబ్బయ్య (బ్యాంక్ ) ప్రతాపరెడ్డి , శివారెడ్డి , రామ్మూర్తి రెడ్డి, శరత్ రెడ్డి, కదిరి చంద్రపాల్. చిన్న బాబు. బి లక్ష్మీ నరసయ్య. బొడిచర్ల శ్రీనివాసులు, నరవక్కటి పల్లి మాజీ ఎంపీటీసీ నరసింహ. మైనార్టీ అధ్యక్షుడు షేక్ గఫూర్ ఖాన్. మౌలాలి , గ్యాస్ బాబయ్య, రాజశేఖర్ యాదవ్, శెట్టిపల్లి నరసింహులు, లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

2,827 Views

You may also like

Leave a Comment