Home వార్తలుఖమ్మం క్రీస్తే లోకానికి నిజమైన వెలుగు – కల్లూరులో ఐక్య క్రిస్మస్ సంబరాలు

క్రీస్తే లోకానికి నిజమైన వెలుగు – కల్లూరులో ఐక్య క్రిస్మస్ సంబరాలు

by VRM Media
0 comments

VRM మీడియా రిపోర్టర్
లక్ష్మయ్య
సత్తుపల్లి నియోజకవర్గం
ఖమ్మం జిల్లా

కల్లూరు, డిసెంబర్ 10 (పిసిడబ్ల్యూ న్యూస్): పట్టణంలోని లక్కినేని గ్రౌండ్‌లో ఇండిపెండెంట్ అసోసియేషన్ క్రిస్టియన్ కమిటీ ఆధ్వర్యంలో ఐక్య క్రిస్మస్ సంబరాలు జరిగాయి. కార్యక్రమానికి వాక్యప్రసంగికారులుగా అంతర్జాతీయ సువార్తికులు డాక్టర్ జాన్ వెస్లీ, విశిష్ట అతిథిగా తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మువ్వ విజయ్ బాబు, ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ ఎనోష్ కుమార్ హాజరయ్యారు.

డాక్టర్ జాన్ వెస్లీ మాట్లాడుతూ “యేసుక్రీస్తే లోకానికి నిజమైన వెలుగు. క్రిస్మస్ అనేది ఆరాధన, ప్రేమ, మార్పు పండుగ” అని పేర్కొన్నారు. క్రీస్తు బోధనలు చీకటి నుంచి వెలుగులోకి నడిపించే మార్గమని తెలిపారు.

చైర్మన్ మువ్వ విజయ్ బాబు మాట్లాడుతూ ప్రేమతత్వం మాత్రమే సమాజంలో నిజమైన మార్పు తీసుకువస్తుందన్నారు. చిన్నారులపై జరుగుతున్న హింసను ఖండిస్తూ, ప్రేమతోనే మనుషుల మనసులు గెలుచుకోవాలని కోరారు.

రెవరెండ్ ఎనోష్ కుమార్ మాట్లాడుతూ క్రీస్తు ప్రేమ, దయ, శాంతిని ప్రతి ఒక్కరూ హృదయంలో నిలుపుకోవాలి అన్నారు. కార్యక్రమం నిర్వహణలో సహకరించిన కమిటీ సభ్యులకు, సేవకులకు, గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎఐసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ క్రైస్తవ సమాజానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు. 2025 కార్యక్రమాల నివేదికను కూడా చదివి వినిపించారు.

ఈ వేడుకలో చిన్నారుల ఆధ్యాత్మిక, సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది హాజరయ్యారు.

2,831 Views

You may also like

Leave a Comment