


అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో పెద్దగెద్దాడ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిటీ చైర్మన్ చోళ్ళ బొజ్జిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు అన్న విషయంపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా హాస్టల వద్ద కనీస సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయని ఆరా తీయగా విద్యార్థులకు త్రాగునీరు కోరకు ఒక ఆర్వో ప్లాంట్ కావాలని అడగగా రాష్ట్ర ఎస్టీ చైర్మన్ బొజిరెడ్డి ఆ విషయంపై ఆర్వో ప్లాంట్ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం దగ్గర్లో ఉన్నటువంటి సచివాలయాన్నీ సందర్శించి ఆ సచివాలయంలో ఉద్యోగులు ఏ విధంగా పనిచేస్తున్నారు, సమయపాలన పాటిస్తున్నార లేదా అనే విషయంపై ఆరా తీశారు. వారితో సామాన్య ప్రజలు ఎవరైనా తమ కార్యాలయానికి వచ్చిన యెడల వారి పనిని సకాలంలో చేసి ఏ విధమైన ఇబ్బందులు కల్పించవద్దని సూచించారు. అదేవిధంగా సచివాలయానికి సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చినటువంటి పేషంట్లకు సరైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.