
బాధిత కుటుంబాలకు.రూ 35 వేల ఆర్థిక సహాయం అందించిన మురళీకృష్ణంరాజు
ప్రత్తిపాడు, VRM.MEDIA న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ డిసెంబర్ 11:–
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి కుటుంబాలను ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీ కృష్ణం రాజు పరామర్శించారు స్థానిక నాయకులు సమక్షంలో అగ్ని ప్రమాదంలో, సర్వం కోల్పోయిన రాళ్ళ అప్పారావు, రాళ్ళ రాజు, రాళ్ళ ఆనందరావు, మూడు బాధిత కుటుంబాలను, పరామర్శించి విచారణ వ్యక్తం చేశారు బాధిత నిరాశ్రయ కుటుంబాలకు రూ10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు పాక్షికంగా దెబ్బతిన్న కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముదునూరి మురళీకృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం,విద్యుత్ వైర్లు కారణముగానే అగ్ని ప్రమాదము చోటు చేసుకుందని అన్నారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కనీసం సహాయం అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులకు పక్కా గృహాలు నిర్మించి తగు వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మేకా చంటిబాబు, విత్తనాలు నాగేశ్వరరావు, దేవ లక్ష్మణ్, తొట్ట జమిందార్,దేవ రాము, కొల్లుబోయిన ఏసుబాబు, ధర్మవరం ఎంపీటీసీ నాని పల్లి చంటి, తదితరులు పాల్గొన్నారు..
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird