Home ఎంటర్‌టెయిన్మెంట్ థియేటర్‌కి వెళ్లి మరి అగ్ర హీరో మూవీ చూసిన రికార్డులు.. ఫ్యాన్స్ హంగామా – VRM MEDIA

థియేటర్‌కి వెళ్లి మరి అగ్ర హీరో మూవీ చూసిన రికార్డులు.. ఫ్యాన్స్ హంగామా – VRM MEDIA

by VRM Media
0 comments
థియేటర్‌కి వెళ్లి మరి అగ్ర హీరో మూవీ చూసిన రికార్డులు.. ఫ్యాన్స్ హంగామా



-ఫ్యాన్స్ సంబరాలు
-ఇంతకీ ఆ సినిమా ఏంటి
-కలెక్షన్స్ లో సంచనాలు

కళ రూపంలో మన ముందున్న సినిమా అనేది ఎంత గొప్పదో చెప్పాలంటే కొన్నియుగాలు అయినా సరిపోవు. ఎన్నో టెన్షన్స్ నుంచి మనుషులని దూరం చేస్తుంది సంపూర్ణ ఆయుష్షుని కలిగించేలా ఆనందాన్ని, హాయిని, హాస్యాన్ని ఇవ్వడంలో ముందు వరుసలో ఉంటుంది అసలు దేవుడే మంచి సినిమా వస్తే మారువేషంలో థియేటర్ కి వచ్చి చూస్తాడనే నానుడి కూడా సినీ ప్రేమికుల్లో ఉంది. అంత శక్తివంతమైనది సినిమా. అంత శక్తివంతమైనది కాబట్టే ఇండియన్ క్రికెట్ టీం తమ షెడ్యూల్స్‌తో ప్రస్తుతం ఉన్న దురంధర్ ని థియేటర్ కి వెళ్లి మరి వీక్షించడం జరిగింది.

ఈ రోజు దక్షిణాఫ్రికాతో జరగబోయే నాలుగో టీ20 మ్యాచ్ కోసం ‘లక్నో’ చేరుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం లక్నోలోని ఒక మల్టీప్లెక్స్‌లో దురంధర్ ని చూడటానికి వెళ్లారు. రాత్రి ఏమిదిగంటల పది నిమిషాల షో కి టికెట్స్ బుక్ చేసుకొని మరి వెళ్లడం విశేషం. మూవీ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి 12.10 అయింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ ఇతర క్రికెటర్లు ధరంధర్ ని చూసిన వాళ్ళల్లో ఉన్నారు. భద్రతా దృష్ట్యా టీం ఇండియా వచ్చారు, సిబ్బందిని తప్ప మరెవరినీ ఈ స్క్రీనింగ్‌లోకి అనుమతించలేదు. భద్రత మరియు సౌభ్యం కోసం మొత్తం థియేటర్ బుక్ చేసారు.


కూడా చదవండి: అవతార్ ఫైర్ అండ్ యాష్ కి షాకింగ్ రివ్యూస్.. ఇచ్చిన సంస్థలు ఇవే

ఇక దురంధర్ పాన్ ఇండియా వ్యాప్తంగా తన హవాని మరింత పెంచుకుంది.తెలుగులో కూడా పెద్ద ఎత్తున కలెక్షన్స్ రాబడుతూ ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. 400 కోట్ల రూపాయలకు చేరువలో ఉంది. ఉగ్రవాద దాడులతో ఇండియాలో అస్తిత్వం సృషించడానికి పాకిస్థాన్ కి చెందిన అరాచక శక్తి రెహ్మాన్ డెకాయిట్(అక్షయ్ ఖన్నా) ప్రయత్నిస్తాడు. దీంతో జస్కి రత్ సింగ్(రణవీర్ సింగ్) అనే ఇండియన్ రాయ్ ఏజెంట్ హంజా మజారి గార్మాన్ డెకాయిట్ దగ్గరే పనిలో చేరతాడు. ఈ సందర్భంగా వచ్చే కథనాలు,నటీనటుల పెర్ ఫార్మెన్స్, క్లైమాక్స్, ఆదిత్య దర్ దర్శకత్వ ప్రతిభ మంత్ర ముగ్దుల్ని చేస్తుంది.

2,818 Views

You may also like

Leave a Comment