Home ఎంటర్‌టెయిన్మెంట్ ధురంధర్ మూవీ డైరెక్టర్ భార్య తెలుగు హీరోయిన్.. బాక్స్ ఆఫీస్ షేక్ – VRM MEDIA

ధురంధర్ మూవీ డైరెక్టర్ భార్య తెలుగు హీరోయిన్.. బాక్స్ ఆఫీస్ షేక్ – VRM MEDIA

by VRM Media
0 comments
ధురంధర్ మూవీ డైరెక్టర్ భార్య తెలుగు హీరోయిన్.. బాక్స్ ఆఫీస్ షేక్



-ఎవరు ఆ హీరోయిన్
-ప్రేమించి పెళ్లి చేసుకున్నారు
-రికార్డు కలెక్షన్స్

ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ‘ధురంధర్'(ధురంధర్)తన ప్రభంజనం యధావిధిగా కొనసాగుతోంది. డిసెంబర్ 5 న సెల్యులాయిడ్ పై అడుగుపెట్టగా ఇప్పటి వరకు నాలుగువందల కోట్లకి పైగా సాధించి ఐదువందల కోట్ల మార్కుకి చేరువలో ఉంది. ప్రేక్షకులతో పోటాపోటీగా సినీ, రాజకీయ, క్రికెట్ సెలబ్రటీస్ కూడా ధురంధర్ ని వీక్షిస్తే ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ సాధించే మూవీగా నిలిచే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు ‘ఆదిత్య దర్'(ఆదిత్య ధర్)కి సంబంధించిన పర్సనల్ న్యూస్ ఒకటి అభిమానులని విశేషంగా ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

ఆదిత్య దర్ భార్య ప్రముఖ హీరోయిన్ ‘యామి గౌతమి'(యామి గౌతమ్). సినిమాల్లోకి రాక ముందు అనేక వాణిజ్య ప్రకటనల్లో కనిపించగా ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ యాడ్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2011లో రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నువ్విలా’ చిత్రంతో తెలుగు పరిశ్రమకి పరిచయమయ్యాక, ఆ తర్వాత అల్లు శిరీష్ డెబ్యూ మూవీ ‘గౌరవం’, తరుణ్‌తో యుద్ధం, నితిన్‌తో కొరియార్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. పలు, తమిళ, కన్నడ చిత్రాలలో కూడా చేసి తన సత్తా చాటగా, 2024లో తానే ప్రధాన పాత్ర హిందీలో ప్రదర్శించిన ఆర్టికల్ 370 చిత్రంతో సోలో విజయాన్ని అందుకుంది. ఇక 2019లో ఆదిత్య దర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉరి’ చిత్రంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడంతో 2021లో పెళ్లి చేసుకున్నారు. ఆదిత్య దర్ మొదటి మూవీ కూడా అదే. జాతీయ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది.

ఇది కూడా చదవండి: థియేటర్‌కి వెళ్లి మరి అగ్ర హీరో మూవీ చూసిన రికార్డులు.. ఫ్యాన్స్ హంగామా

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదిత్య దర్ నిర్మాతగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ధూమ్ ధామ్ తో పాటు ఇమ్రాన్ హష్మీ తో హక్ అనే సినిమా నవంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య దర్ కెరీర్ విషయానికి వస్తే ఉరి తర్వాత ఆర్టికల్ 370, ధూమ్ ధామ్, బారాముల్లా వంటి చిత్రాలకి రైటర్ గా పనిచేశారు. ఆరు సంవత్సరాల తర్వాత ‘ధురంధర్’ తో వచ్చి ఇండియా సినిమా తన వైపు చూసేలా చేసుకున్నాడు.

2,811 Views

You may also like

Leave a Comment