Home ఎంటర్‌టెయిన్మెంట్ కలెక్షన్స్ లో మా వాటా మాకు ఇవ్వాలి.. పాకిస్థాన్ ప్రజల డిమాండ్ – VRM MEDIA

కలెక్షన్స్ లో మా వాటా మాకు ఇవ్వాలి.. పాకిస్థాన్ ప్రజల డిమాండ్ – VRM MEDIA

by VRM Media
0 comments
కలెక్షన్స్ లో మా వాటా మాకు ఇవ్వాలి.. పాకిస్థాన్ ప్రజల డిమాండ్




-మా వాటా ఎంతో తెలుసా!
-పాకిస్థాన్ ఏమంటుంది
-ఎంత వచ్చాయి
-లయరీ ని బాగానే వాడారు

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ‘ధురంధర్'(ధురంధర్)ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడానికి ప్రీ ప్రిపరేషన్‌లో ఉంది. వెయ్యి కోట్ల రూపాయిల కలెక్షన్స్ కి చేరువ కాబోతుండటమే అందుకు ఉదాహరణ. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ ఫైర్ అండ్ యాష్ కూడా ‘దురంధర్’ పై ఎలాంటి ప్రభావం చూపించలేదు. అంతలా ధురంధర్ భారీ విజయం వైపు దూసుకెళ్తుంది. దీనికి ప్రధాన కారణం నటినటుల పెర్ఫార్మెన్స్తో పాటు చిత్ర కథ. ముఖ్యంగా పాకిస్థాన్(పాకిస్థాన్)లోని కరాచీ(కరాచీ)లో ఉన్న ‘లయరీ'(Lyari)ప్రాంతం కూడా విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఇప్పుడు ఆ లయరీ ప్రాంత ప్రజలు పలు డిమాండ్లు ని ధురంధర్ మేకర్స్ ముందు ఉంచుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాళ్ళు మాట్లాడుతు ‘ధురంధర్ కథ మా ప్రాంతంలో జరిగే కథగా చిత్రీకరించారు కాబట్టి కలెక్షన్స్ లో వాటా ఇవ్వాలి. వారి వాటా ఎనభై శాతం ఉండాలి. అసలు సగం వాటా ఇవ్వాలి. మేకర్స్ మా ఏరియాలో హాస్పిటల్ కట్టించి ఇవ్వాలి. ఒక వేళ మేకర్స్ ఇవ్వాలనుకున్నా మాకు ఒక రూపాయికి కూడా వచ్చే పరిస్థితి ఉంటుందని ఇలా లయరీ కి చెందిన పలువురు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.


ఇది కూడా చదవండి: సిఐడి ఆఫీస్ లో మంచు లక్ష్మి.. రీజన్ ఇదే

లయరీ టౌన్ విషయానికి వస్తే ఒకప్పుడు కరుడుగట్టిన రౌడీయిజానికి పెట్టింది పేరు. రెహ్మాన్ డెకాయిట్ ఒక అసాంఘిక శక్తి తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటాడు. ఇండియాలో జరిగే ఉగ్రవాదుల దాడులకి కూడా సాయం చేస్తాడు. దీంతో మన ఇండియన్ రా ఆఫీసర్ మారుపేరుతో డెకాయిట్ దగ్గర పనిలో చేరి కుడి భుజంగ మారతాడు. ఆ తర్వాత అక్కడి లోకల్ పోలీస్ అధికారి, పొలిటికల్ లీడర్‌తో కలిసి డెకాయిట్ ని అంతమొందిస్తాడు.దీంతో కథ కాలాన్ని బట్టి, క్యారక్టర్ ల మైండ్ సెట్ ని బట్టి లయరీ టౌన్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అటువంటి టౌన్ ని మేకర్స్ పర్ఫెక్ట్ గా సెట్ తో తీర్చిద్ది అక్కడే కథ జరుగుతున్నట్టుగా మెస్మరైజ్ చేయడం జరిగింది.

2,811 Views

You may also like

Leave a Comment