VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం తేది:31-12-2025, బుధవారం
👉పోలవరం జిల్లా ఏర్పాటు పై ఆదివాసులు హార్షం
👉
ఎమ్మెల్యే శిరీషదేవి ఆధ్వర్యంలో పాలాభిషేకం
మన్యవాసుల చరిత్రలో చెరగని ముద్రగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటారని కూటమి సర్కార్ కి కృతజ్ఞతగా ఉంటామని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషదేవి అన్నారు. రంపచోడవరం ఎన్టీఆర్ కూడలిలో బుధవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద పోలవరం జిల్లా ఏర్పాటు చేసినందుకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కూటమి సర్కార్ పేరుతో కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ హర్షం వ్యక్తం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో రాజీ లేకుండా సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి నెరవేర్చే వ్యక్తి అన్నారు. ఆయన చరిత్రలో ఒక సువర్ణధ్యాయం ఉంటారన్నారు. రంపచోడవరం నియోజకవర్గం ప్రజల పాలిట దేవుడుగా ఉంటారని కొనియాడారు. మన్యం చరిత్రలో ఆయన చేసే సంస్కరణలు ఎప్పటికి మర్చిపోలేని విధంగా ప్రయోజనకారిగా ఉంటాయన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. కూటమి సర్కార్ కి మన్యవాసులు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చిన్నం బాబూరమేష్, సీతంశెట్టి వెంకటేశ్వరరావు, వంతల రాజేశ్వరి,నియోజకవర్గం పార్టీ పరిశీలకులు కొల్లుబోయిన శ్రీనివాస యాదవ్, రాష్ట్ర ఎస్టీకమిషన్ డైరెక్టర్ గొర్లె సునీత, రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సుభాని,APIIC డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, AMC చైర్మన్ లోతా లక్ష్మణరావు,మండలపార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్ అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు అడబాల బాపిరాజు,బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్వప్న కుమారి, జనసేన నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి, పాపోలు శ్రీనివాస రావు, నియోజకవర్గం ఎస్టీ విభాగం అధ్యక్షులు పండా చెల్లన్న దొర, సీతపల్లి దేవస్థానం డైరెక్టర్ సిద్ధా వెంకన్న దొర,ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు షేక్ చోటు, మాజీ సర్పంచ్ నిరంజనీ దేవి, బీసీ విభాగం నాయకులు ఎంపీటీసీ కరక వెంకటరమణ, మాజీ ఎంపీపీ తీగలప్రభ, రైతు విభాగం నాయకులు కనిగిరి రాంబాబు, కంగల పోశమ్మ, మండలపార్టీ అధ్యక్షులు పుల్లయ్య,భాస్కర రావు,రమణారెడ్డి, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు వెదుళ్ల లచ్చిరెడ్డి, గొర్లె చిన నారాయణ, ఉద్యోగ సంఘాల నేతలు బోండ్ల వర ప్రసాద్, ఎల్. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
