బద్వేల్ VRM న్యూస్ రిపోర్టర్ జనవరి 2
బద్వేల్ మండలం కోటవీధి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని కోటవీధి నందు డాక్టర్ సౌమ్య మరియు సిద్ధవటం మలేరియా సభ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు పిహెచ్ఎన్ కే వెంకటమ్మ ఎం పి హెచ్ ఎ ఎస్ శ్రీరామయ్య ఆధ్వర్యంలో ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ప్రతి ఆరోగ్య కార్యకర్తకు డెంగ్యూ బుక్లెట్ వారికి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఫ్రైడే ఫ్రైడే పాటించాలని తెలియజేశారు. మరియు ప్రతి సోమవారం కీటక జనిత వ్యాధులను గురించి ఉత్పన్నమయ్యే ప్రదేశాలను గుర్తించి ఆరోగ్య కార్యకర్త యాప్ ద్వారా సమస్యలను గుర్తించాలని తెలియజేశారు. స్క్రబ్ టైపస్ జ్వరాలను గురించి ఆరోగ్య కార్యకర్తలకు మరియు ఆశా కార్యకర్తలకు కోటవీధి గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగినది. ప్రతి ఒక్కరు కూడా జ్వరం వచ్చిన వెంటనే వైద్యాధికారి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించి సరైన సమయంలో వైద్య చికిత్స చేయించుకున్న ఎడల స్క్రబ్ టైపస్ బారిన పడకుండా ఉండవచ్చునని తెలియజేశారు. వ్యాధి లక్షణాలు స్క్రబ్ టైపస్ బ్యాక్టీరియా కుట్టినచోటు నల్లటి మచ్చ కలిగి ఉంటుంది ఆ పరిసరాలలో దద్దుర్లు కలిగి కూడా ఉంటారు ఇలాంటి జ్వరం కేసు వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించు కోవలెను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎమ్స్ వైద్య సిబ్బంది ఆశలు పాల్గొన్నారు.


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird