VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రంవ్యవసాయ శాఖ
***
పత్రికా మిత్రులకు నమస్కారం !
మండల వ్యవసాయ అధికారి
దేవిపట్నం కె.వెంకటేశ్వర్లు తెలియజేయునది ఏమనగా !ఈ రోజు దేవీపట్నం మండలంలో ఇందుకూరుపేట రైతు సేవ కేంద్రంలో రైతులకు యూరియా పంపిణీ చేయడం జరుగుతుంది .రైతులు పట్టాదారు పాస్ బుక్ జిరా.క్స్ ,ఆధార్ కార్డు తీసుకుని వచ్చి బయోమెట్రిక్ విధానంలో ఎరువులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము . బస్తా యూరియా MRP రేటు 266.50 పైసలు చెల్లించి రైతులు యూరియా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రస్తుతం ఇందుకూరు ఇందుకూరుపేట ,శరభవరం రైతు సేవ కేంద్రాల్లో 20 టన్నులు చొప్పున మొత్తం 60 టన్నులు యూరియా నిల్వ ఉంచడం జరిగినది. కావున మన దేవీపట్నం మండలంలో దాళ్వా పండించే వరి ,మొక్కజొన్న అపరాలు పండించే రైతులు ఎరువులు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరియు ఇందుకూరు రైతు సేవ కేంద్రంలో కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా గురించి, మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు రైతులకు, గ్రామ పెద్దలకు తెలియజేస్తూ వరి, మొక్కజొన్న పంటల యాజమాన్య పద్ధతులు, APFR రిజిస్ట్రేషన్, వ్యవసాయ యాంత్రీకరణ సర్వే, దాల్వ ఈ పంట నమోదు రైతులకు తెలియజేయడం జరిగింది రైతులు ఈ పంట నమోదులో తమ పంట వివరాలు నమోదులో జాగ్రత్తలు తీసుకోవాలని అనగా పంట పేరు ,రకం ,విస్తీర్ణం సాగు దారిని వివరాలు, కౌలు రైతులు తప్పనిసరిగా సిసి ఆర్సి కార్డు లేదా రైతులతో ఒప్పందం చేసుకున్న పత్రం తీసుకొని పంట నమోదు చేయించుకోవాలని తెలియజేయడమైనది.
ఇట్లు
కె.వెంకటేశ్వర్లు
మండల వ్యవసాయ అధికారి దేవి పట్నం.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird