Home Uncategorized రైతులకు కొత్తపట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు.

రైతులకు కొత్తపట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు.

by VRM Media
0 comments

VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం రైతులకు కొత్తపట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు.

– నేటి నుంచి ఈనెల 9 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

– ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్స్ తో కూడిన పాస్ బుక్స్ అందజేత

రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాడాల గ్రామంలో రీ సర్వే చేయబడి ప్రభుత్వం నూతనంగా జారీచేసిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ అధికారులతో కలిసి రైతులకు అందజేసిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు..

ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజా సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా పాలన సాగిస్తుందన్నారు.. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటోలతో జారీ చేసిన పాసుపుస్తకాల్లో తప్పిదాల వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు..అన్ని ఇబ్బందులను అధిగమించి జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్ తో కూడిన పాస్ బుక్ లను రైతులకు నేడు అందజేస్తున్నామన్నారు. నేటి నుంచి ఈనెల 9 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6688 గ్రామాల్లో రీ సర్వే చేసిన కూటమి ప్రభుత్వం వెబ్ ల్యాండ్ లోని వివరాలతో 21.80 లక్షల పాస్ పుస్తకాలు ముద్రణ చేసిందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు , జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

2,807 Views

You may also like

Leave a Comment