Home Uncategorized పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారిని కలిసి కృష్ణునిపాలెం పునరావాస కాలనీ మౌలిక వసతులు కల్పించాలని అర్జీ పెట్టిన జనసేనపార్టీ అధ్యక్షులు చారపు వెంకటరాయుడు

పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారిని కలిసి కృష్ణునిపాలెం పునరావాస కాలనీ మౌలిక వసతులు కల్పించాలని అర్జీ పెట్టిన జనసేనపార్టీ అధ్యక్షులు చారపు వెంకటరాయుడు

by VRM Media
0 comments

(VRM- MEDIA పోలవరం ఐనవిల్లి భద్రం)
పోలవరం ఇరిగేషన్ ప్రాజక్టు లో దేనిపట్నం లో గల 44 గ్రామాలు నీటములగటం అందరికి తెలినవిషయమే అయితే సుమారు 18 గ్రామాల్లో నాన్ ట్రైబ్ వారిని గోకవరం మండలంలో కృష్ణునిపాలెం వంచాయితీ లో పునరావాస కాలని నిర్మించారు. అయితే 16 గ్రామాల్లో ఉన్న యువతి యువకులకు చాలా మందికి పెండింగ్ ల్లో ఉండిపోవటం వల్ల 1స్ట్ లిస్ట్ 2న్డ్ లిస్ట్ 3ర్డ్ లిస్ట్ అంటూ ఇంతకాలం సర్వే లమీద సర్వేలు నిర్వహించారు.అందులో ఒక 80 మంది యువతి యువకులకులను అర్హులు గా గుర్తించారు ప్రస్తుతం ఉన్న కాలనీ లో ఒకచోట తండ్రికి ఒకరోట కొడుకు ఫ్లాట్ లు రాగ ఇప్పుడు అర్హులైన వారు మా అన్న వాళ్ళు ఇక్కడే వున్నారు మా చెల్లి వాళ్ళు ఇక్కడే వున్నారు కాబట్టి మాకు పునరావాసం ఇక్కడే కావాలి అని అధికారులను కోరగా మెటనే స్పందించిన ఆర్.డి.ఓ గా పి.ఓ గా స్పెషల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ ఆదిత్య వారు పునరావాసం ఇక్కడే నిర్మించటానికి ఒకే చెయ్యటం విడ్డురం కాలీగా వున్నా స్థలాలు వాడుకోడుకోవటం లో తప్పులేదు దాన్ని మేము స్వాగతిస్తున్నాం…కానీ గవర్నమెంట్ ల్యాండ్ అనేది కొని వారికి పునరావాసాన్ని నిర్మించాలి కానీ అలా చెయ్యకుండా ఈ కాలనీ నిర్మాణం మొదలుపెట్టే ముందు ఇచ్చిన అప్రూవల్(బ్లూ ప్రింట్) ప్రకారం 1064 ఇల్లు నిర్మాణము చేశారు. ఈ 1064 ఇల్లులకు కాలనీ సంబంధించిన మౌలిక సదుపాయాలకు గాను మ్యాప్ లో ఇచ్చిన వాటిని నిర్మించకపోగా ఆ స్థలాలను వేరే వారికి కేటాయించడం పట్ల నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు.ఇప్పుడు ఆ అప్రూవల్ మార్చేసి ,.
కొత్తగా అర్హులైన నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి ఇంటి వట్టాలను సైతం సిద్ధం చేశారు ఇచ్చేయటం జరిగింది.వారికి ఇల్లు నిర్మించడం పై మాకు ఎటువంటి అభ్యంతరంలేదు కానీ 100ఎకరాల భూమిని కొని నిర్మించాల్సిన పునరావాస కాలనీ ని 70ఎకరాల్లో నిర్మించారు అనే సందేహం మాలో వుంది అందులోనే మళ్ళీ ఇలా చేస్తే మనుషులు పెరుగుతారు తప్ప స్థలం పెరగదు దానివల్ల నిర్వశితులు నిర్వశితులే కొట్టుకుని చచ్చిపోయే పరిస్థితిని అధికారులు సృష్టించటం సబబు కాదు.
ఏ అధికారి అయినా సరే మా కాలనీ లోకి విజిట్ కి వచ్చి సమస్యలు తెలుసుకున్నది లేదు పైగా ఎరకంగా చేతులు దులుపుకోవాలో అని చూస్తున్నారు మాకు రావాల్సిన సౌకర్యాలను అడగటం కూడా తప్పు లానే వుంది..
మీరు వెనకాల అర్హులుగా ప్రకటించిన వారికి పునరావాసం కల్పించే ముందు కింద చూపిస్తున్న ప్రతి పాయింట్ పై ఎంక్వేరీ చెయ్యాలని కోరుతూ
1).ఎలిమెంట్రీ స్కూల్ భవనం చూపించండి.
2).అంగన్వాడీ భవనం చూపించండి.
3).హైస్కూల్ పిల్లలకు సంబంధించిన ఆట స్థలం చూపించండి.
4).పోస్ట్ ఆఫీస్ చూపించండి.
5).ఆరోగ్య సబ్ సబ్ సెంటర్ చూపించండి.
6).పార్క్ మినహాయించి స్థలం చూపించండి.
7).పసువులకేంద్రం చూపించండి సదుపాయాలు చూపించండి.
8).జెసి స్టోర్ ని చూపించండి.
9).కాలనీ చుట్టూ నించాల్సిన ప్రహరీ ని చూపించండి.
9).పునరావాస కాలనీ 100ఎకరాలు కొలతలు కొలిచి నిజ నిర్ధారణ చెయ్యండి…
ఇవన్నీ ప్రభుత్వంవారి అధికారులు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ లో క్షుణ్ణంగా వున్నాయి. కలెక్టర్ గారికి పూర్తిగా వివరించటం జరిగిందఅని రాయుడు తెలియచేసారు✍️✊🙏

2,809 Views

You may also like

Leave a Comment