సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ జనవరి 6
రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మమైన హెచ్పిసిఎల్ హిందుస్థాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు, రాయలసీమ ట్రేడ్ యూనియన్ లో 450 మంది డ్రైవర్లు చేరడం సంతోషకరమని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి తెలిపారు సిద్ధవటం మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి భాకరాపేట సమీపాన ఉన్న హిందుస్థాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు మంగళవారం రాయలసీమ ట్రేడ్ యూనియన్ లో చేరారు ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి మాట్లాడుతూ కార్మిక సంఘాలు రాజ్యాంగం కల్పించిన హక్కులను పోరాటాల వల్లే సాధించుకున్నారని ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘాలపై ఆధిపత్యం చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు ప్రతి రంగంలో వారి వారి హక్కుల కోసం సంఘాలు ఏర్పాటు చేసుకున్నార చిన్న స్థాయి కార్మికులు ఐక్యతగా హక్కుల కోసం పోరాడాలని అనంతరం ఆయిల్ ట్యాంకర్ల యూనియన్ అధ్యక్షులుగా రవిశంకర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో హెచ్పీసీఎల్ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ట్రేడ్ యూనియన్ సంఘ నాయకులు పాల్గొన్నారు

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird