Home ఎంటర్‌టెయిన్మెంట్ ఐబొమ్మ రవికి బిగ్ షాక్ – VRM MEDIA

ఐబొమ్మ రవికి బిగ్ షాక్ – VRM MEDIA

by VRM Media
0 comments
ఐబొమ్మ రవికి బిగ్ షాక్



ఐబొమ్మ రవికి షాకిచ్చిన నాంపల్లి కోర్టు
బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన న్యాయస్థానం

పైరసీ వెబ్‌సైట్‌ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవికి బిగ్ షాక్ తగిలింది. అతని బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఐబొమ్మ రవిపై ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు కేసుల్లో తనకు బెయిల్ అందించాలని కోరుతూ రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు.

తాజాగా ఈ బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రవికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని చెప్పారు. విచారణ జరిపిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.

2,804 Views

You may also like

Leave a Comment