Home Uncategorized ఖమ్మం లో brs వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన..

ఖమ్మం లో brs వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన..

by VRM Media
0 comments

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులకు సన్మాన కార్యక్రమం లో భాగంగా, మొదట ఖమ్మంలోని రాపర్తి నగర్ నుంచి భారస పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు, తదుపరి బారాస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 1/2 లక్షల ఎకరాల కోసం మా హయాంలో సీతారాం ప్రాజెక్టును మొదలుపెట్టాము, అదేవిధంగా బారాస హాయంలో, ప్రతి ఒక్క గ్రామానికి నీళ్ల ట్యాంకులు, వైకుంఠధామాలు, హరితహారంలు, ప్రకృతి వనంలు ఏర్పాటు చేశామని మాట్లాడారు, అదేవిధంగా మా హయాంలో ప్రతి ఒక్క రైతుకు ఎటువంటి యూరియా కొరత లేకుండా కేంద్రంతో మాట్లాడి రైతులకు ఏర్పాటు చేశామని తెలియజేశారు, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన ప్రజలకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదని దుయ్యబట్టారు, వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో అన్ని స్థానాలు భారసను గెలిపించ వలసిందిగా కార్యకర్తల్ని కోరారు, అలాగే ఈసారి బారాస ప్రభుత్వo తప్పక అధికారంలోకి వస్తుందని తెలియజేశారు. తదుపరి నూతన సర్పంచులకు సన్మానం చేశారు,ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, రేగా కాంతారావు, లింగాల కమల్ రాజ్, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

2,809 Views

You may also like

Leave a Comment