Home Uncategorized పురిటి బిడ్డను పారేసి వెళ్లిన కసాయి తల్లి, సకాలంలో స్పందించిన కానిస్టేబుల్ మధుకర్

పురిటి బిడ్డను పారేసి వెళ్లిన కసాయి తల్లి, సకాలంలో స్పందించిన కానిస్టేబుల్ మధుకర్

by VRM Media
0 comments


కె. రెడ్డిశేఖరబాబు VRM రిపోర్టర్
అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలాజీ నగర్ లో శుక్రవారం అమానుష ఘటన ఉదయం వెలుగు చూసింది. తీవ్ర కలకలం రేపుతున్న ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలమేరకు అప్పుడే పుట్టిన పురిటి బిడ్డను ఓ కసాయి తల్లి పారేసి పేగు బంధాన్ని తెంచుకుని వెళ్లింది. వెంటనే టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మధుకర్ వెళ్లి. పేగు కూడా ఊడని ఆ పసి కందును ఎత్తుకుని చుట్టు పక్కల విచారించారు. ఆ బిడ్డను వదిలి వెళ్లిన ఆ కసాయి తల్లి ఎవరన్నది తెలియ రాలేదు. రాత్రంతా బిడ్డ చలికి విలపిస్తుంటే చూడలేక స్థానికంగా ఉన్న ఓ మహిళ మనసు చలించింది. కానిస్టేబుల్ ను అడిగి ఐసిడిఎస్ అధికారులు వచ్చే వరకు ఆ బిడ్డను తన వద్దనే ఉంచు కుంటానని అక్కున చేర్చుకుంది. మరన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్చి ఉంది.

2,806 Views

You may also like

Leave a Comment