Home Uncategorized సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకులు బెల్లంకొండ శరత్ కు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గంలో సముచిత స్థానం కల్పించాలి

సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకులు బెల్లంకొండ శరత్ కు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గంలో సముచిత స్థానం కల్పించాలి

by VRM Media
0 comments

వేజండ్ల సాయి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు

ఖమ్మం యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెల్లంకొండ శరత్ కు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గంలో సమచిత స్థానం కల్పించాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేజెండ్ల సాయి అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ ను బెల్లంకొండ శరత్ తో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేజెండ్ల సాయి మాట్లాడుతూ బెల్లంకొండ శరత్ 2010 నుండి NSUI కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులుగా పనిచేశారని,ఉన్నత విద్యావంతుడుగా మరియు ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శి గా మూడు పర్యాయాలు ఎలక్షన్ పద్ధతిలో ఘన విజయం సాధించి రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ గా పనిచేస్తూ గడచిన 10 సంవత్సరాలలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై శరత్ యువజనులను కలుపుకొని పోరాటం సాగించారని,కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసిన బెల్లంకొండ శరత్ ను డిసిసి కార్యవర్గంలో తీసుకోవాలని వేజండ్ల సాయి డీసీసీ ప్రెసిడెంట్ నూతి సత్యనారాయణ కు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులతో పాటు SC సెల్ జిల్లా అధ్యక్షులు బొడ్డు బొందయ్య తదితరులు పాల్గొన్నారు.

2,805 Views

You may also like

Leave a Comment