మర్యాదపూర్వకంగా కలిసిన ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 31
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ని బుధవారం డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ OSD కె వెంకటకృష్ణ దంపతులకు ఒంటిమిట్ట జెడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిOSD వెంకటకృష్ణ దంపతులకు ఘన స్వాగతం పలికి శాలువా పూలమాలతో వారిని సత్కరించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ లాంచనాలతో స్వాగతం పలికి, ప్రదక్షణ కావించి, గర్భాలయంలోని మూలవిరాట్ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రంగమండపంలో సేద తీరిన వారిని అర్చకులు సత్కరించి స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈయన వెంట జెడ్పీ సీఈవో ఓబులమ్మ, డిపిఓ ఏఈ ఖాదర్‌భాషా పాల్గొన్నారు.

