ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దు కృష్ణ రెడ్డి
VRM న్యూస్ బాలమౌళి ఒంటిమిట్ట డిసెంబర్ 31
ఒంటిమిట్ట మండల సచివాలయంలో డీపీఓ రాజలక్ష్మి మరియు డీపీఓ కార్యాలయ ఏవో ఖాదర్బాషాలను ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తున్నందుకు గాను వారిని ప్రజా ప్రతినిధులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీదేవి, జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి, బొబ్బిలి రాయుడు, సాలా బాద్ బుజ్జి, ఎంపీపీ ప్రతినిధి, ఎంపిటిసి భాష, చంద్రశేఖర్, మల్లికార్జున, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమం సందర్భంగా వక్తలు మాట్లాడుతూ—ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలవ్వాలంటే అధికారుల సేవాభావం కీలకమని పేర్కొన్నారు. ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుంటూ సమర్థవంతమైన పాలన అందించడంలో డీపీఓ రాజలక్ష్మి, ఏవో ఖాదర్బాషా కృషి అభినందనీయమని తెలిపారు. కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో సాగగా, సన్మానితులు అందరి సహకారంతో మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.

