(VRM- ఐనవిల్లి భద్రం)
రైతు భరోసా కేంద్రాల అధికారులను సైతం భయబ్రాంతులకు గురించేస్తూ సొమ్ముచేసుకుంటున్న వైనం.
రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైతు కష్టానికి అన్యాయం జరక్కుండా తగిన చర్యలు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అయితే దేవీపట్నం మండలంలో నలుగురు దళరులు రైతులకు లేనిపోని మాటలు చెప్పి భయబ్రాంతులకు గురి చేసి ప్రభుత్వం కాటా ధాన్యం 17,77/-రూపాయలు కేటాయించిగా దళారులు రైతుల వద్దనుంచి 1400/-రూపాయలకు కొని దాన్ని మళ్ళీ రైతుభరోసా కేంద్రాలకు అమ్ముతున్నారు.
రైతుల వద్దనుంచే ధాన్యం కొలనాలి ప్రభుత్వం ఒకపక్క చెప్తున్నా అధికారులను మభ్యపెట్టొ బెదిరించో వ్యాపారం చేస్తున్నారు.అధికారులు మాట వినకపోతే రాత్రుళ్ళు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫిస్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీ వివరాలు చెప్పండి మావాళ్లు వచ్చినా పని చేసి పెట్టట్లేదు అంటూ దళారులు మోసపూరిత ఫోన్లు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఉదాహరణకు ధాన్యం లోడ్ కి 450 కాటాలు రాగ 580 కాటాలు గా నమోదు చెయ్యాలని వత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి అధికారులు అలా మేము చెయ్యం అని చెప్పగా వేణుతిరిగిన దళారులు.
చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులు కష్టాన్ని ఎలా దోచుకుంటున్నారు అంటే ప్రభుత్వం రేటు ప్రకారం కాటాలు 100×1777 =177,700/- రాగ దళారులు రైతుల వద్ద 100×1400= 1,40,000/- వస్తుంది ప్రభుత్వం కేటాంచిన మొత్తం దళారులు కేటాయించిన మొత్తం మైనెస్ చెయ్యగా 37,700/-రూపాయలు వంద కటాలకు దళరులు లాభం పొందుతున్నారు. ఆ లెక్కలో కేవలం దేవీపట్నం మండలంలో మూడు రైతు భరోసా కేంద్రాలలో సుమారు ఒక యాభై లోడ్లు లోడ్ కొచ్చి 500 నుంచి 600 కాటాలు వెళ్తుంటే రైతులను అలానే ప్రభుత్వాన్ని ఎన్ని లక్షల్లో మోసం చేస్తున్నారో చుడండి.
ఇదంతా బానే వుంది కానీ అంత ధాన్యం లోడ్ వెళ్ళినప్పుడు మిల్లు వాళ్ళు చెక్ చేసుకోరా అని అంటే రైతు భరోసా కేంద్రంలో ఎంటర్ చేసిన ఫామ్ ని ఆధారం గా చేసుకుని మిల్లు యాజమాన్యం లెక్కపూరీతంగా తీసుకునే చర్యాలు వుండవు పైగా దళారులు మిల్లు వాళ్ళు ముందుగానే ఒప్పందానికి వచ్చే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తు రైతు కష్టాన్ని దోచుకుంటున్నారు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు.
వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతుల పట్ల శ్రద్ద వహించి ప్రతిరైతుకి అవగాహనా సదస్సులు ఎర్పాటు చేసి వారు నష్టపోతున్న కష్టాన్ని వారికి వివరించి ప్రభుత్వానికి అమ్మటం వల్ల ఒకరోజు ఆలస్యం అవ్వొచ్చు కానీ బయటతో పోల్చుకుంటే మీకు మీ కష్టం విలువ ఇంతా అని వివరించి రైతులకు న్యాయం చెయ్యాలని కోరుకుంటూ ఈ మోసపూరిత దళారులపై నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి మిరియాల శిరీష దేవి గారికి అలానే సివిల్ సప్లై మినిష్టర్ శ్రీ నాదెండ్ల మనోహర్ వారికి తెలియచేస్తానని జనసేపార్టీ అధ్యక్షులు చారపు వెంకటరాయుడు తెలియచేసారు.
