రెడ్డిశేఖరబాబు(దావన్)
నందలూరు రిపోర్టర్
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నందు పర్యటించి ముందుగా నందలూరు సొసైటీ చైర్మన్ ప్రవీణ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్ మరియు డైరెక్టర్లు మాసపల్లె రమణ మరియు శివారెడ్డి చే నూతన ప్రమాణస్వీకారం చేయించిన చమర్తి జగన్మోహన్ రాజు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మాట్లాడుతూ సహకార సంఘాలు,రైతుల బలానికి పునాదులని,వాటిని మరింత బలోపేతం చేసి ప్రతి రైతు కుటుంబంలో సుసంపన్నత చేకూరేలా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సారధ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతాంగ అభ్యున్నతిని అగ్ర ప్రాధాన్యంగా తీసుకొని,రైతు సంక్షేమానికి అవసరమైన ప్రతి చర్యను వేగవంతం చేస్తుందని తెలియజేశారు. అదేవిధంగ రైతుల సమస్యలను వినిపించుకోవడమే ,కాకుండా వాటికి తక్షణం పరిష్కారం చూపే సమర్థత,నిజాయితీ పక్షపాతం,ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో మూల సూత్రాలు ఈ అభివృద్ధి పథంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములుగా చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు.
అదేవిధంగా జగన్మోహన్ రాజు సారధ్యంలో బలిజ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు,బలిజ సామాజిక వర్గానికి చెందిన వారినే మండల పార్టీ అధ్యక్షులు,సొసైటీ చైర్మన్లు,క్లస్టర్ ఇన్చార్జ్లును నియమించినందుకు పార్టీ క్యాడర్ హర్షం వ్యక్తం చేశారు.
అంతకుముందు సొసైటీ చైర్మన్ ఆధ్వర్యంలో చమర్తి జగన్ మోహన్ రాజు కి ఘన స్వాగతం పలికారు.అనంతరం వారు చమర్తికి కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ,కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
