సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ జనవరి 3
స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా టక్కోలు గ్రామపంచాయతీలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహించారు. గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పారిశుధ్య కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు.
ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, రాజంపేట నియోజకవర్గ ఇంచార్జి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో, పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి ఈ శానిటేషన్ డ్రైవ్ కొనసాగించారు.
గ్రామ సర్పంచ్ లక్ష్మీ దేవి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, చిన్నపరెడ్డితో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు సమిష్టిగా పాల్గొని గ్రామ వీధులు, డ్రైన్లు, ప్రజా ప్రదేశాలను శుభ్రం చేశారు. చెత్త తొలగింపు, పారిశుధ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్తులను పరిశుభ్రత వైపు ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా నాగముని రెడ్డి మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ఒక్కరోజు కార్యక్రమం కాదని, ప్రతిరోజూ పాటించాల్సిన బాధ్యత అని తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణంతోనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మించవచ్చని పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌తో టక్కోలు గ్రామపంచాయతీ ఆదర్శ గ్రామంగా నిలవాలనే దిశగా ముందడుగు పడిందని అయన హర్షం వ్యక్తం చేశారు.

