vrm media ప్రతినిధి ఖమ్మం

అన్నమయ్య జిల్లా రిపోర్టర్ రెడ్డిశేఖరబాబు (దావన్)
మదనపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న శ్రీ సాయి గణేష్ మెస్ లో కడప జిల్లా పోరుమామిళ్ళకు చెందినటువంటి సాఫ్ట్వేర్ దంపతులు శ్రీమతి సుజాత A. రవి కుమార్ గుడ్లు టిఫిన్ చేసుకుని పొరపాటున వారికి చెందినటువంటి బంగారు నగలు కలిగి ఉన్న బ్యాగును మర్చిపోయి వారి సొంత ఊరైన పోరుమామిళ్ళకు వెళ్ళిపోయినారు. అక్కడ వెళ్లి గమనించగా తాము బ్యాగులు ఎక్కడో పోగొట్టుకున్నట్లు తిరిగి మదనపల్లిలోని సాయి గణేష్ వద్దకు వచ్చి విచారించగా అక్కడ సదరు బ్యాగ్ లేనందున మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా సిఐ మహమ్మద్ రఫీ సదరు ఫిర్యాదు పై దర్యాప్తును ప్రారంభించి క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ సతీష్ మరియు రామమూర్తి నాయక్ లను సీసీ ఫుటేజ్ లను పరిశీలించి దర్యాప్తు చేయమని ఆదేశించగా. సీసీ ఫుటేజ్ లను ఆధారంగా దర్యాప్తు ప్రారంభించగా సుమారు 80 సంవత్సరాల వృద్ధుడు తాను పొరపాటున బ్యాగును తీసుకెళ్లినానని విచారించగా తెలిసినది. అంతట సుమారు 80 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకొని సదరు సొత్తుదారులైన శ్రీమతి సుజాత కే రవికుమార్ దంపతులు మదనపల్లి వన్ టౌన్ స్టేషన్ లో సదర్ నగలు వారి వీనని గుర్తించారు. పొరపాటున బ్యాగును తీసుకువెళ్లిన వృద్ధుని చూసి తమకు ఎలాంటి ఫిర్యాదు అవసరం లేదని చెప్పగా అంతట మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ 3ఎస్ మహేంద్ర 80 గ్రాముల బంగారు నగలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా మదనపల్లి వన్ టౌన్ సిఐ శ్రీ మహమ్మద్ రఫీ క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ శ్రీ సతీష్ కుమార్. కానిస్టేబుల్ శ్రీ రామ్మూర్తి నాయకులను డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.