కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 6
రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మకు సిద్దవటం ఒంటిమిట్ట మండలాల చేనేత నాయకులు, కార్మికులు కడప చెన్నై జాతీయ రహదారి కొత్త మాధవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోడ్డు మార్గాన రాజంపేట నియోజకవర్గం నందలూరుకి పట్టాదారుల పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి వెళుతున్న సందర్భంగా కడప జిల్లా ఇన్చార్జి మంత్రి సవితమ్మను కలిసి స్వాగతం పలికి పట్టు శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు చేనేత, గ్రామ సమస్యల పైన వినతులు అందచేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సమస్యల పరిస్కారానికి కృషిచేస్తానని తెలిపారు. మంత్రి తోపాటు కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసుల రెడ్డి, రాజంపేట ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు, ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుడు ముద్దు కృష్ణారెడ్డి,టిడిపి అధ్యక్షులు రాజశేఖర్, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు నాగముని రెడ్డి, సిద్దవటం మండల ఉపాధ్యక్షుడు చిన్నం సుబ్బరాయుడు, మామిళ్ళ శ్రీహరి, సామా శ్రీనివాసులు, బొడిచెర్ల శ్రీను, పుత్తా బాబు, గంజి సుబ్బరాయుడు, అవ్వారు రవిశంకర్, మల్లూరు బాలాజీ, గురు మెాహన్, రామక్రిష్ణ, మునగపాటి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird