తాసిల్దార్ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో
VRM న్యూస్ బాల మౌలాలి జనవరి6
ఒంటిమిట్ట మండలందర్జీపల్లి గ్రామంలో ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా ఈ–పాస్‌బుక్ పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ దామోదర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన రైతులకు ఈ–పాస్‌బుక్‌లు అందజేశారు.
ఈ సందర్భంగా జెడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి, బొబ్బిలి రాయుడు, ఎంపీపీ ప్రతినిధి బుజ్జి, ఎస్వి రమణ, మాజీ సర్పంచ్ నరసింహులు, యూనిట్ ఇంచార్జ్ ఎల్ల యాదవ్ చంద్రపాల్, ఈశ్వరయ్య, సుబ్బరాయుడు, మహీం, వీఆర్వో అంజి, పెన్న పేరు గ్రామ సర్వేయర్, వీఆర్ఏలు ఇతర రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తహసీల్దార్ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ భూమి హక్కుల పరిరక్షణలో ఈ–పాస్‌బుక్‌లు కీలక పాత్ర పోషిస్తాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
