Home Uncategorized ఒంటిమిట్టలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవితమ్మకి ఘన స్వాగతం

ఒంటిమిట్టలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవితమ్మకి ఘన స్వాగతం

by VRM Media
0 comments

ఇన్చార్జి మంత్రి సవితమ్మకు వినతిపత్రాలు

ఒంటిమిట్ట మండలానికి 30 గ్రామాల నీటి స్కీమ్‌పై వినతులు

డ్వాక్రా మహిళల జీతాల పెంపుపై చర్చ

VRMన్యూస్ బాల మౌలాలి జనవరి 6

ఒంటిమిట్ట: జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవితమ్మకుకి ఒంటిమిట్టలో ఘన స్వాగతం లభించింది. ఒంటిమిట్ట కోదండ రామాలయం వెనుకవైపు జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించి, నాయకత్వానికి సంఘీభావం తెలిపారు
కడప జిల్లా ఇన్చార్జి మంత్రి సవితమ్మక, తెలుగుదేశం పార్టీ పాల్ రెడ్డి బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డికి రాజంపేట నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఒంటిమిట్ట మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు కలిసి పలు కీలక అంశాలపై వినతులు సమర్పించారు.
ఈ సందర్భంగా ఒంటిమిట్ట మండలంలోని 30 గ్రామాలకు నీటి పంపిణీ స్కీమ్ను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ప్రత్యేక వినతిపత్రి అందజేశారు. వేసవిలో తాగునీటి సమస్య తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రికి వివరించారు.
అలాగే డ్వాక్రా మహిళల జీతాలు పెంచాల్సిన అవసరం, స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళలకు ఉపాధి అవకాశాల విస్తరణపై చర్చ జరిగింది. మండలంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులపై కూడా దృష్టి సారించాలని కోరుతూ దాదాపు పది వినతిపత్రాలు సమర్పించారు. ఎంపీపీ లక్ష్మీదేవి, జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి, బొబ్బిలి, బుజ్జి, రమణ, ఈశ్వరయ్య, వీరాంజనేయ, శ్రీనివాసరెడ్డి, శరత్ రెడ్డి, శివారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, చంద్రపాల్, వెంకటరెడ్డి, రాజారెడ్డి, రామసుబ్బారెడ్డి, రోశయ్య, బాలకృష్ణ, చౌడయ్య, లక్ష్మీనారాయణ రెడ్డి, రాజాబాబు, మల్లికార్జున, జై సింహారెడ్డి, శివరామిరెడ్డి, చిన్న పుల్లయ్య, కొండారెడ్డి, పెంచలయ్య, సుబ్బనరసయ్య, శ్రీనివాసులు, వెంకటేశు, ఎల్లయ్య, మల్లేష్ యాదవ్, పిచ్చయ్య యాదవ్, నాగరాజా, నరసింహ, రవి, సుబ్బయ్య, పాటయ్య, రాజంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నాయుడు ,శివ నారాయణ చౌదరి ,సుబ్రహ్మణ్యం నాయుడు శ్రీనివాసరాజు, కుడుములూరు రమణ, చెన్నయ్య, జానకి పెద్ద రమణ ,నరసింహులు ,బాబయ్య,బాలకృష్ణ,చంద్ర, ఆది, చంటి, డాక్టర్ జిలాని, భాష, ఇలియాస్. గఫూర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ అధికారులు ఎంపీడీవో సుజాతమ్మ, వెటర్నరీ డాక్టర్ ఏడి ఉమా, ఏపీవో శివశంకర్ రెడ్డి, ఏపీఎం అశోక్ రెడ్డి, ఏవో రామసుబ్బారెడ్డి హాజరయ్యారు.

2,829 Views

You may also like

Leave a Comment