Home ఎంటర్‌టెయిన్మెంట్ వైరల్ గా మారిన మొదటి టికెట్ రేటు.. కొన్న లెజండ్ ఎవరో తెలుసా – VRM MEDIA

వైరల్ గా మారిన మొదటి టికెట్ రేటు.. కొన్న లెజండ్ ఎవరో తెలుసా – VRM MEDIA

by VRM Media
0 comments
వైరల్ గా మారిన మొదటి టికెట్ రేటు.. కొన్న లెజండ్ ఎవరో తెలుసా



-సంచలనం సృష్టిస్తున్న మన శంకర వర ప్రసాద్
-ఫాస్ట్ టికెట్ కి భారీ రేటు
-కొన్నది ఈ లెజండ్ నే

తెలుగు సినీ గ్లోబల్ మార్కెట్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana shankara varaprasad garu)ద్వారా మరోసారి చిరంజీవి మ్యానియాతో కళకళలాడనుంది. రిలీజ్ డేట్ జనవరి 12 కి కౌంట్ డౌన్ కూడా మొదలవ్వడంతో అభిమానుల్లో తమ బాస్ ని చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో చూడబోతున్నామనే ఆనందం వాళ్ల ముఖాల్లో కనపడుతుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఏ స్థాయిలో ఉండబోతుందో , మాస్ అంశాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ పర్ఫెక్ట్ చిరంజీవి సినిమాగా అనిల్ రావిపూడి తీర్చిదిద్దినట్టుగా కనపడుతుంది.

చిరంజీవి సినిమాకి టికెట్స్ సంపాదించే విషయంలో అభిమానుల్లో దాదాపు వారం ముందు నుంచే హడావిడి ఉండటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఎవరి టికెట్స్ విషయంలో కూడా పోటీ ఉండటంతో పాటు ముందు టికెట్ తమకే దక్కాలని కోరుకుంటారు. ఈ కోరుకునే ఆంధ్రప్రదేశ్(ఆంధ్రప్రదేశ్)లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రధాన నగరమైన అమలాపురం పట్టణానికి చెందిన వెంకటరమణ థియేటర్ లో మొదటి టికెట్ కి సంబంధించి వేలం జరిగింది. ఆ వేలంలో మెగా అభిమాని వెంకట సుబ్బారావు లక్ష పదకొండు వేల రూపాయలకి కొనుగోలు చేసి
మొదటి టికెట్ ని దక్కించుకున్నాడు.

ఇది కూడా చదవండి: రెహ్మాన్ కి షాక్ ఇచ్చిన పెద్ది టీం.. సంగీత తుఫాన్ మరింత డబుల్

బుక్ మై షో తో పాటు జరుగుతున్న యాప్‌లలో కొన్ని ఏరియాలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్‌గా ఫాస్ట్‌గా బుకింగ్‌లు జరుగుతున్నాయి. రేపు హైదరాబాద్(హైదరాబాద్)లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరగబోతుంది. విక్టరీ వెంకటేష్(వెంకటేష్)కూడా కీలకమైన క్యారక్టర్ లో చేస్తు ఒకే టికెట్ పై డబుల్ ధమాకా ని అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చిన విషయం తెలిసిందే.

2,812 Views

You may also like

Leave a Comment