Home ఎంటర్‌టెయిన్మెంట్ హీరో విజయ్ కి సీబీఐ నోటీసులు! – VRM MEDIA

హీరో విజయ్ కి సీబీఐ నోటీసులు! – VRM MEDIA

by VRM Media
0 comments
హీరో విజయ్ కి సీబీఐ నోటీసులు!



కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం(TVK) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే 2025, సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో నిర్వహించిన టీవీకే పార్టీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జనవరి 12న విచారణకు హాజరు కావాలంటూ తాజాగా విజయ్‌కి సీబీఐ నోటీసులు ఇచ్చింది.

కరూర్ తొక్కిసలాట ఘటనపై తొలుత తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ జరపగా.. ఆ తర్వాత సుప్రీం కోర్టు విచారణతో సీబీఐ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురిని ప్రశ్నించారు. తాజాగా టీవీకే అధినేత విజయ్ కి నోటీసులు ఇచ్చింది. 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

కాగా, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘జన నాయకన్’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి: రాజా సాబ్, జన నాయకన్ థియేటర్స్ ఇష్యూ.. నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు!

2,815 Views

You may also like

Leave a Comment