Home Uncategorized కడపలో కొనసాగింపుపై మంత్రికి కృతజ్ఞతలుమంత్రిని ఘనంగా సత్కరించిన కుప్పాల వెంకటసుబ్బయ్య

కడపలో కొనసాగింపుపై మంత్రికి కృతజ్ఞతలుమంత్రిని ఘనంగా సత్కరించిన కుప్పాల వెంకటసుబ్బయ్య

by VRM Media
0 comments

సిద్దవటం VRM న్యూస్ జనవరి 7

సిద్ధవటం,ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించడంపై ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య కడప ఇన్చార్జ్ మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు.బుధవారం కడపలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో ఆయన మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూలబొకే అందించారు.గతంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా సిద్ధవటం,ఒంటిమిట్ట మండలాలను కడప నుంచి అన్నమయ్య జిల్లాలో విలీనం చేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై రెండు మండలాల్లో తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. దీనిపై కూటమి ప్రభుత్వం పునరాలోచించి రెండు మండలాలను కడపలోనే కొనసాగించేలా చర్యలు తీసుకుని గెజిట్ విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో రాజంపేట నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తోందని మంత్రి సవితకు కుప్పాల విన్నవించారు.

2,819 Views

You may also like

Leave a Comment