తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యం
ప్రత్యేక అధికారుల బృందంతో జూ పార్క్ ఏర్పాటుకు అటవీ ప్రాంతం పరిశీలన
కోరుకొండ నేటి బ్రహ్మాస్త్రం
రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులుగా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తూ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ కృషితో నేడు దివాన్ చెరువు వద్ద జూ పార్క్ ఏర్పాటుకై ఢిల్లీ నుండి విచ్చేసిన ప్రత్యేక అధికారుల బృందంతో కలిసి జూ పార్క్ నిర్మాణం కోసం దివాన్ చెరువు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజానగరం మండలం దివాన్ చెరువు లో సుమారు 310 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. అందులో 250 హెక్టార్లలో జూ పార్క్ ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతమని తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి, స్థానిక పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి కి పూర్తి వివరాలతో వారిని కలిసి తెలియజేయగా ప్రభుత్వం వారు వెంటనే స్పందించి కేంద్ర అటవీ శాఖ అధికారులతో చర్చించి నేడు ప్రత్యేక అధికారుల బృందాన్ని పంపి ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది..ఈ 250 హెక్టార్ల భూమి ఎగుడు దిగుడు లేకుండా సమాంతరమైన నేల అవడం వలన జూ పార్క్ ఏర్పాటుకు అనువైన ప్రాంతమని అధికారుల బృందం తెలియజేస్తూ త్వరలోనే జూ పార్క్ ఏర్పాటుకు సంబందించిన పనులు ప్రారంభించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలియజేసారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అతి తొందరలోనే దివాన్ చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో ముందంజలో ఉంచుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడపా శ్రీనివాస్, కిమిడి శ్రీరామ్, నాతిపాము దొరబాబు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

