ఒంటిమిట్టమండలంలోని కోనరాజు పల్లి గ్రామం అరుంధతి వాడ ప్రజలు పుణ్యం చేసుకున్నారని మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడు అన్నారు. కోనరాజుపల్లిలో బయటపడ్డ పంచలోహ విగ్రహాలను ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కాయ కర్పూరం సమర్పించి, స్వామి వారికి నమస్కరించుకున్నారు. ఆయన వెంట టీడీపీ మాజీ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు పుత్తా రామచంద్రయ్య, టీడీపీ సీనియర్ నాయకుడు ఉన్నం కిరణ్ స్వామి పాల్గొన్నారు.