జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి, రాటాల రామయ్య
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ జనవరి 8
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల పట్టా భూములపై హక్కు కల్పించే విధంగా నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు మండలంలోని ఉప్పరపల్లి గ్రామం లో తన నివాసమందు గురువారం ఆయన మాట్లాడుతూ రైతుల పట్టా పాస్ పుస్తకాలపై గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి చిత్రం పెట్టడంపై రైతులు భూ హక్కు కోల్పోతామని రైతు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారని మా ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టాక రైతుల పొలాలు రి సర్వే చేయించి రాజముద్రలతో కూడిన రైతుల పట్టాదారుల పాస్ పుస్తకాలు ఇవ్వడంపై రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారని మా ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కొరకై చిత్తశుద్ధితో ఉందని తెలిపారు
